News September 12, 2025
HNK: జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్

✓ హనుమకొండలో 51, వరంగల్లో 60 ట్రాఫిక్ కేసులు
✓ HNK: పట్టుబడిన పేకాట రాయుళ్లు
✓ డ్రగ్స్ సమాచారాన్ని అందించండి: WGL పోలీస్
✓ WGL: భారీగా పట్టుబడిన గుట్కా ప్యాకెట్లు
✓ పరకాల మాజీ జడ్పీటీసీ మృతి
✓ HNK: ఆడుకుంటూ కుప్ప కూలిన విద్యార్థి
✓ సైబర్ నేరాలపై మహిళలు అవగాహన కలిగి ఉండాలి: ACP
✓ మిల్స్ కాలనీ పరిధిలో పట్టుబడిన పేకాట రాయుళ్లు
Similar News
News September 12, 2025
ములుగు: సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించాలి: కలెక్టర్

సాదా బైనామా దరఖాస్తులను పరిశీలించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర అధికారులను ఆదేశించారు. తహశీల్దార్, రెవెన్యూ అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన సాదా బైనామా దరఖాస్తులకు నోటీసులు ఇచ్చి సర్వే పూర్తి చేయాలని సూచించారు. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం, గ్రీవెన్స్ దరఖాస్తుల పరిశీలన, ధ్రువీకరణను వేగవంతం చేయాలన్నారు.
News September 12, 2025
జనగామ: భూ భారతి దరఖాస్తులను వేగవంతం చేయాలి: కలెక్టర్

భూ భారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన భూ భారతి, సాదా బైనామ, జాతీయ కుటుంబ లబ్ధి పథకం, సీఎం ప్రజావాణి దరఖాస్తులపై సమీక్షించారు. ఎమ్మార్వోల సందేహాలను నివృత్తి చేస్తూ, వేగవంతమైన పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు.
News September 12, 2025
HYD: కరెంట్ ఎప్పుడు విశ్రాంతి తీసుకోదు: MD

HYD వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో TGSPDCL ఎండీ ముషారఫ్ అలీ విస్తృతంగా పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. HYDలో కరెంట్ ఎప్పుడు విశ్రాంతి తీసుకోదని తెలియజేస్తూ.. POWER NEVER TAKES BREAK అని Xలో రాసుకోచ్చారు. వినియోగదారులందరికి అత్యుత్తమ నాణ్యమైన విద్యుత్ అందించడం కోసం యంత్రాంగం కృషి చేస్తున్నట్లు వివరించారు.