News October 29, 2025
HNK: ధాన్యం కొనుగోళ్లలో సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ధాన్యం కొనుగోలులో ఎదురయ్యే సమస్యల పై ఫిర్యాదుల స్వీకరణకు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ మంగళవారం ప్రారంభించారు. రైతులు ధాన్యం కొనుగోలు సమస్యల పరిష్కారానికి 7330751364ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News October 29, 2025
సంగారెడ్డి జిల్లా ఏఓగా సత్యనారాయణ నియామకం

సంగారెడ్డి జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త కార్యాలయ నూతన ఇన్‌ఛార్జ్ అడ్మినిస్ట్రేషన్ అధికారిగా డాక్టర్ సత్యనారాయణ నియమితులయ్యారు. ఈయన సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డెంటల్ సర్జన్‌గా విధులు నిర్వహిస్తూ తాజాగా బదిలీపై ఇక్కడికి వచ్చారు. అయితే ఇప్పటివరకు ఇక్కడ ఏఓగా పనిచేసిన డాక్టర్ భాగ్యశేఖర్‌ను ఇటీవల బాధ్యతల నుంచి తొలగించారు.
News October 29, 2025
పాలమూరు: డిగ్రీ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విడుదల..!

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ (రెగ్యులర్, బ్యాక్‌లాగ్) ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్‌ను యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. నవంబర్ 7 నుంచి 12వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ www.palamuruuniversity.com ను చూడండి.
News October 29, 2025
ఆర్థిక పొదుపు.. తెలివిగా ఆలోచించు!

మెరుగైన భవిష్యత్తు కోసం ఆర్థిక నిర్వహణ అత్యవసరం. ప్రతి నెల ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ‘ముఖ్యంగా క్రెడిట్ కార్డు అప్పులను త్వరగా తీర్చడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఊహించని ఖర్చుల కోసం కనీసం 3-6 నెలల జీవన వ్యయానికి సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం తెలివైన పని. ఈ అలవాట్లు స్థిరమైన ఆర్థిక భద్రతను అందిస్తాయి’ అని చెబుతున్నారు.


