News February 11, 2025
HNK: నేటి నుంచి భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్

ఓరుగల్లు జిల్లా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త తెలిపారు. 11 రోజులపాటు రద్దవుతుందని ప్రకటించిన భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించినట్లు రైల్వే అధికారి శ్రీధర్ ఉత్తర్వులు జారీచేశారు. నేడు SECలో బయల్దేరి కాజీపేట మీదుగా కాగజ్‌నగర్(ఈనెల11 నుంచి 14)కు వెళ్తుందని, మళ్లీ 12న కాగజ్‌నగర్ నుంచి SEC(ఈనెల 12-15)వరకు నడపనున్నట్లు అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Similar News
News December 11, 2025
జగిత్యాల: ఉదయం 9 వరకు 16.67% పోలింగ్

జగిత్యాల జిల్లాలో జరుగుతున్న సర్పంచ్, వార్డు ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 16.67% పోలింగ్ నమోదైంది. మొత్తం 2,18,194 మంది ఓటర్లలో 36,377 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. భీమారం మండలంలో 21.59%, మేడిపల్లిలో 20.83%, కొరుట్లలో 17.74% మెట్‌పల్లిలో 17.69% పోలింగ్ నమోదైంది. ఇబ్రహీంపట్నం 15.86%, కథలాపూర్ 14.87%, మల్లాపూర్లో 12.66% ఓటింగ్ జరిగింది. కాగా, జిల్లాలో శాంతియుతంగా ఎన్నికలు కొనసాగుతున్నాయి.
News December 11, 2025
నిర్మల్ జిల్లాలో 16.57 పోలింగ్ నమోదు

నిర్మల్ జిల్లాలో జరుగుతున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గురువారం ఉదయం 9 గంటల వరకు ఆరు మండలాల్లో కలిపి మొత్తం 16.57 శాతం పోలింగ్ నమోదైంది. మండలాల వారీగా చూస్తే.. దస్తూరాబాద్‌లో 20.13 శాతం, కడెం 18 శాతం, ఖానాపూర్ 20.30 శాతం, లక్ష్మణచందా 10.92 శాతం, మామడ 15.73 శాతం, పెంబి 15.63 శాతం పోలింగ్ నమోదైంది.
News December 11, 2025
సిద్దిపేట జిల్లాలో 9 గంటల వరకు ఇలా..!

సిద్దిపేట జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏడు మండలాల్లో ఉదయం 9 గంటల వరకు 24.38 శాతం నమోదైందని అధికారులు తెలిపారు. దౌల్తాబాద్ 22 శాతం, గజ్వేల్‌లో 21 శాతం, జగదేవపూర్ 21.27 శాతం, మర్కూక్ 29.30 శాతం, ములుగు 26.87 శాతం, రాయపోలు 26. 37 శాతం, వర్గల్ 26.37 శాతం పోలింగ్ నమోదైంది.


