News February 25, 2026

HNK: నేటి నుంచే ఇంటర్ పరీక్షలు

image

హనుమకొండ జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మొదలుకానున్నాయి. జిల్లాలో మొత్తం 18,696 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా విద్యార్థులు అల్పాహారం తీసుకుని, గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. హాల్‌టికెట్, పెన్నులతో పాటు సామగ్రిని జాగ్రత్తగా ఉంచుకోవాలని, సెల్‌ఫోన్లు, డిజిటల్ వాచీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

Similar News

News February 27, 2026

అంగన్వాడీ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ పథకం: సీతక్క

image

రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. ప్రస్తుతం ములుగు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ప్రతి చిన్నారికి 100 ml పాలను అందిస్తున్నామని, రక్తహీనత తగ్గించేందుకు చిరు ధాన్యాల చిక్కీలు ఇస్తున్నామన్నారు. అమ్మ మాట.. అంగన్వాడీ బాట ఫలితంగా చిన్నారుల నమోదు పెరిగిందన్నారు. మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి పథకాలకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు.

News February 27, 2026

ఎందుకలా?!: ఎండాకాలంలో రోడ్లపై నీళ్లు ఉన్నట్లు..

image

సమ్మర్‌లో రోడ్లపై కనిపించే ఎండమావులు ఓ భ్రమ. తారు రోడ్డు అధిక ఉష్ణోగ్రతకు చేరుకున్నప్పుడు దానిపై ఉన్న గాలిపొరను వేడి చేస్తుంది. ఆ టైమ్‌లో పైన ఉన్న చల్లని గాలి నుంచి రోడ్డుపై ఉండే వేడి గాలిలోకి కాంతి ప్రవేశించినప్పుడు కిరణాల దిశ మారి మన కంటికి కన్పిస్తుంది. దీంతో రోడ్డుపై నీరు ఉన్నట్లు భ్రమ కలుగుతుంది. వేడి గాలిలో కాంతి వేగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కిరణాలు వంగుతాయి. డైలీ 4pmకు ఎందుకలా?!.

News February 27, 2026

మెదక్ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్

image

మెదక్ నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రతిమా సింగ్‌ను టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ ఆధ్వర్యంలో ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో సత్కరించి, మొక్కను అందజేశారు. గతంలో తాను అదనపు కలెక్టర్‌గా పనిచేసినప్పుడు ఉద్యోగులు అందించిన సహకారాన్ని కలెక్టర్ గుర్తుచేసుకున్నారు. అదే స్ఫూర్తితో జిల్లా అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని ఆమె సూచించారు.