News January 31, 2025
HNK: పదో తరగతి విద్యార్థులకు రేపటి నుంచి స్నాక్స్

ప్రభుత్వ స్కూళ్లలో పదో తరగతి చదివే విద్యార్థులకు రాష్ట్ర సర్కార్ తీపి కబురు చెప్పింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు ఈవెనింగ్ స్నాక్స్ అమలు చేయనుంది. ఇందుకు ఒక్కో విద్యార్థి కోసం రూ.15 చొప్పున ఖర్చు చేయనుంది. పల్లీపట్టి, బిస్కెట్లు, పకోడీ తదితరాలను అందించనున్నారు. జిల్లాలోని 2,834 మంది విద్యార్థులను గాను రూ.16,15,380 నిధులు మంజూరయ్యాయి. వీటిని స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల ఖాతాల్లో జమ చేయనున్నారు.
Similar News
News March 1, 2026
సంక్రాంతి తర్వాత డల్ టాలీవుడ్ డల్

సంక్రాంతికి కళకళలాడిన టాలీవుడ్ బాక్సాఫీసు ఆ తర్వాత డల్ అయింది. పండగ తర్వాత రిలీజైన తెలుగు సినిమాలు ఆ రేంజ్ ఆదరణ దక్కించుకోలేకపోయాయి. గత నెలరోజుల్లో రిలీజైన 10 సినిమాల్లో ఏ ఒక్కటీ మంచి కలెక్షన్స్ రాబట్టుకోలేకపోయింది. పెద్ద సినిమాలు లేకపోవడం, టికెట్ ధరలు, ఓటీటీలకు ఆడియన్స్ ప్రాధాన్యం ఇవ్వడం మొదలైనవి కారణాలుగా తెలుస్తోంది. అయితే ఈనెల, ఏప్రిల్‌లో బడా సినిమాల రిలీజ్‌తో పరిస్థితి మారే అవకాశం ఉంది.
News March 1, 2026
నిజామాబాద్: జిల్లా ప్రజలకు సీపీ కీలక సూచనలు

నిజామాబాద్ జిల్లా ప్రజలకు సీపీ సాయిచైతన్య కీలక సూచనలు చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే ప్రాంతాల్లో విగ్రహ ప్రతిష్ఠలు నిషేధించినట్లు చెప్పారు. రాత్రి 10 గం.ల నుంచి ఉదయం 6 గం.ల వరకు డీజేలు వాడకూడదన్నారు. భారీ సభలకు, డ్రోన్ల వినియోగానికి ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ఈ నిబంధనలు మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు అమలులో ఉంటాయన్నారు.
News March 1, 2026
నేడు విండీస్‌తో ఢీ.. ఈ’డెన్’ కలిసొస్తుందా?

T20WC: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా నేడు భారత్-విండీస్ తలపడనున్నాయి. సెమీస్ చేరాలంటే భారత్ తప్పక గెలవాల్సిన మ్యాచ్ ఇది. అయితే 1983 నుంచి ఈడెన్‌లో భారత్‌ను విండీస్ ఎప్పుడూ ఓడించలేకపోయింది. భారత్ చేతిలో నాలుగు T20I సహా తొమ్మిది మ్యాచ్‌లు ఓడిపోగా మరో రెండు డ్రా అయ్యాయి. ఇక 2016 టీ20 ప్రపంచకప్ తర్వాత విండీస్ ఎప్పుడూ సెమీస్ చేరలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.


