News November 11, 2025
HNK: ఫిజియోథెరపీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

హనుమకొండ జిల్లా సమగ్ర శిక్ష విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న భవిత కేంద్రాల్లో ఫిజియోథెరపిస్టు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్, ఇన్‌చార్జ్ డీఈఓ వెంకటరెడ్డి తెలిపారు. పరకాల, శాయంపేట, ఆత్మకూరు, దామెర, వేలేరు, కమలాపూర్, భీమదేవరపల్లి, నడికూడ మండలాల్లో తాత్కాలిక నియామకాలు చేపడతారు. ఈ నెల 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
Similar News
News November 11, 2025
భద్రాద్రి రామయ్యతో అందెశ్రీకి ప్రత్యేక అనుబంధం

ప్రముఖ రచయిత అందెశ్రీ నిన్న మరణించిన సంగతి తెలిసిందే. అయితే అందెశ్రీకి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది. కొత్తగూడెంలో నిర్వహించిన జాతీయ స్థాయి బాలోత్సవ్‌కు పలుమార్లు హాజరయ్యారు. కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగం, పాడిన పాటలను స్మరించుకున్నారు. కొత్తగూడెం, భద్రాచలం పరిసరాల్లో ఏప్రాంతానికి వచ్చిన గోదావరిలో స్నానం చేసి రామయ్యను దర్శనం చేసుకునేవారని గుర్తు చేసున్నారు.
News November 11, 2025
అందెశ్రీకి మన ఖమ్మంతో ప్రత్యేక అనుబంధం

ప్రముఖ రచయిత అందెశ్రీ నిన్న మరణించిన సంగతి తెలిసిందే. అయితే అందెశ్రీకి మన ఖమ్మంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన నెలనెల వెన్నెల 65వ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాయమైపోతున్న మనిషి విలువల గురించి చేసిన ప్రసంగం, పాడిన పాటను పలువురు నెమరేసుకున్నారు. అందెశ్రీ మృతికి నెలనెల వెన్నెల నిర్వాహకులు సంతాపం తెలిపారు. అందెశ్రీ ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నామన్నారు.
News November 11, 2025
ఖమ్మంలో కొత్త రేషన్ కార్డుల జోరు

పేదలకు ఆహార భద్రత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీని వేగవంతం చేసింది. జనవరి నాటి 4,11,143 కార్డులకు అదనంగా 52,406 కొత్త కార్డులు మంజూరయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కార్డుల సంఖ్య 4,63,549కి చేరింది. ఏప్రిల్ 1 నుంచి ఉచిత సన్న బియ్యం పంపిణీ జరగడంతో కొత్తగా లబ్ధి పొందుతున్న వారికి ఉపశమనం లభించింది.


