News March 14, 2025

HNK: బాల్యంలో ఈ పూలతోనే హోలీ (PHOTO)

image

హనుమకొండలోని ఓ చెట్టుకు విరబూసిన పూలు మన బాల్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒంటిపూట బడికెళ్తుంటే రోడ్డు పక్కనే ఇవి గుబాలించేవి. ఈ పూల మకరందం రుచిచూసి మైమరచిన బాల్యం మళ్లీ గుర్తొస్తోంది. పండగొస్తుంది అనే సంబరంలో ఎండలో తిరిగి ఈ పూలను ఒకరోజు ముందే సేకరించేవాళ్లం. నీటిలో ఉడికించి రంగు ఊరిన నీళ్లతో ఆడిన హోలీ బాల్యంలో ఓ మధురజ్ఞాపకమే. ఈ ఏడాదైనా మోదుగ పూలతో హోలీ జరుపుకోండి. HAPPY HOLI

Similar News

News November 5, 2025

జూబ్లీ సర్వేల వెనుక కేటీఆర్ కుట్ర: చనగాని దయాకర్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కేటీఆర్ వెనుక ఉండి చేయిస్తున్న ఫేక్ సర్వేలతో ప్రజల అభిప్రాయం మారదని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో మాట్లాడుతూ.. ఫేక్ సర్వేలు పూర్తి ప్రజా అభిప్రాయం కాదన్నారు. సర్వేల వెనుక కేటీఆర్ కుట్ర ముమ్మాటికి ఉందని అందుకే సర్వేల ఆర్టిస్టులు బయటకు వచ్చారన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు ముమ్మాటికి అభివృద్ధిని కోరుకుంటున్నారన్నారు.

News November 5, 2025

ప్రతాపసింగారం: పంచవృక్షాల మహిమాన్వితం.. శైవక్షేత్రం

image

మేడ్చల్ జిల్లా ప్రతాపసింగారంలోని శివాలయం విశిష్టతతో భక్తుల మనసును ఆకట్టుకుంటోంది. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు నిర్మించిన ఈ దేవాలయంలో రావి, మారేడు, వేప, ఉసిరి, జమ్మి పంచవృక్షాలు ఒకేస్థలంలో పెరిగాయి. ఈ 5 వృక్షాలు సాక్షాత్ దైవతత్త్వాన్ని ధారపోస్తూ ఆ ప్రదేశాన్ని పవిత్ర శక్తిక్షేత్రంగా మార్చేశాయి. ఆధ్యాత్మిక తేజస్సు విరజిమ్మే ఈ ప్రాంగణంలో కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే శుభఫలాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.

News November 5, 2025

జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర దాడులకు కుట్ర?

image

జమ్మూకశ్మీర్‌లో దాడులకు లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సంస్థలు ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. పాక్ SSG, ISI సాయంతో ఆయా సంస్థల టెర్రరిస్టులు దేశంలోకి చొరబడినట్లు అనుమానిస్తున్నాయి. టెర్రరిస్టు షంషేర్ ఆధ్వర్యంలోని టీమ్ డ్రోన్ల ద్వారా LoC గ్యాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చెక్ చేసిందని చెప్పాయి. క్రాస్ బార్డర్ అటాక్స్ చేసేందుకు పాక్ బార్డర్ యాక్షన్ టీమ్స్ సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించాయి.