News March 1, 2026

HNK: మావోయిస్టు లొంగుబాటు

image

జిల్లాలోని కాజీపేట మండలం తరాలపల్లికి చెందిన ముప్పిడి సాంబయ్య అలియాస్ వికాస్ ఛత్తీస్‌గఢ్ పోలీసుల ముందు లొంగిపోయారు. ఆయనతో పాటు మరో 15 మంది మావోయిస్టులు కూడా ఆయుధాలతో జనజీవన స్రవంతిలోకి వచ్చారు. వికాస్ ప్రస్తుతం ఒడిశా రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్నారు. ఆయన లొంగుబాటుతో స్థానికంగా హర్షాతిరేకాలు వెలువెత్తాయి.

Similar News

News March 1, 2026

NTR: హైకోర్టు గెస్ట్ హౌస్ పనులకు శంకుస్థాపన చేసిన CJI

image

అమరావతి హైకోర్టు సమీపంలో 6,300 చదరపు గజాల స్థలంలో నిర్మించనున్న గెస్ట్ హౌస్ పనులకు CJI జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సైట్‌లో సీఎం చంద్రబాబు, సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులతో కలసి CJI పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 50,000 చదరపు అడుగుల బిల్ట్ అప్ ఏరియాలో G+3 తరహాలో అధికారులు CRDA ఈ గెస్ట్ హౌస్‌ నిర్మించనున్నారు.

News March 1, 2026

నారయణపేటలో రేపే మెగా జాబ్ మేళా

image

నారాయణపేట జిల్లా కేంద్రంలోని శ్రీ చిట్టెంనర్సిరెడ్డి స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రేపు భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. వివిధ ప్రతిష్టాత్మక కంపెనీల ప్రతినిధులు హాజరై అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు నిరుద్యోగ యువతీయువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ మెర్సీ వసంత కోరారు. అర్హత గల అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో ఉదయాన్నే కళాశాలకు హాజరు కావాలన్నారు.

News March 1, 2026

VZM: ప్రశాంతంగా జిల్లా గురుకుల ప్రవేశ పరీక్ష

image

విజయనగరం జిల్లాలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని ఉమ్మడి జిల్లా సమన్వయ కర్త ఎం.మాణిక్యం తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 5వ తరగతి ప్రవేశ పరీక్షకు 1309 మందికి 1116 మంది హాజరు కాగా 193 మంది గైర్హాజరు అయ్యారన్నారు. ఇంటర్ జనరల్ పరీక్షకు 1433 మందికి 1292 మంది హాజరు కాగా.. 141మంది గైర్హాజరు అయ్యారని, ఐఐటీ-నీట్ పరీక్షకు 856 మంది హాజరయ్యారన్నారు.