News April 17, 2025
HNK: మొదలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరగతులు!

HNK జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ తరగతుల్లో భాగంగా పాఠశాల విద్యార్థులకు AI ద్వారా గణితం, సైన్స్, ఆంగ్ల భాషల్లో ఇంకా మంచి విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. శిక్షణ తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News April 19, 2025
NGKL: ఎమ్మెల్యే వంశీకృష్ణను పరామర్శించిన MLA రాజేశ్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ కొన్ని రోజులుగా గుండె సంబంధిత వ్యాధికి చికిత్స తీసుకుని ని విశ్రాంతి తీసుకుంటున్నాడు. శుక్రవారం ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే వంశీకృష్ణను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వంశీకృష్ణ త్వరగా కోలుకొని ప్రజా జీవితంలోకి రావాలని ఆకాక్షించారు. నాయకులు పాల్గొన్నారు.
News April 19, 2025
నేడు నాగర్‌కర్నూల్‌కు మంత్రి పొంగులేటి రాక

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని తేజా కన్వెన్షన్ హాల్‌లో జరిగే భూభారతి అవగాహన సదస్సుకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి వస్తున్నట్లు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వినోద్ తెలిపారు. సదస్సులో పొంగులేటితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు,MLA రాజేశ్ రెడ్డి, MLC దామోదర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి పాల్గొంటారని తెలిపారు. వివిధ విభాగాల కాంగ్రెస్ నాయకులు, ప్రజలు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.
News April 19, 2025
30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకపోతే..

పురుషుల్లో ఒంటరితనం వల్ల మానసిక ఆందోళన, ఒత్తిడి పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. స్త్రీలలో సంతానోత్పత్తి, గర్భాశయ సమస్యలు అధికమవుతాయి. లేటు మ్యారేజ్‌లో భాగస్వామితో గొడవలు, డివోర్స్ అవకాశాలు ఎక్కువట. మరోవైపు కుటుంబం, సమాజం నుంచి కూడా ప్రశ్నలు, విమర్శలు ఎదురవుతూ ఉంటాయి. 30 ఏళ్లు దాటాక మనసుకు నచ్చకపోయినా వచ్చిన సంబంధాన్ని ఒప్పుకోక తప్పదు. రాజీపడాల్సి వస్తుంది.