News September 14, 2024

HNK: రీల్స్ చేస్తూ హై టెన్షన్ వైరు తాకి గాయాల పాలైన యువకుడు

image

రైలు పైకి ఎక్కి రీల్స్ చేస్తుండగా హైటెన్షన్ వైర్లు తాకి వ్యక్తి గాయాలపాలైన ఘటన కాజీపేటలో చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. రాజ్ కుమార్ అనే వ్యక్తి కడిపికొండ దగ్గరలో గల రాంనగర్ సమీప రైల్వే ట్రాక్‌పై ఆగిఉన్న గూడ్స్ రైలుపైకి సెల్ఫీలు దిగుతూ రీల్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో హై టెన్షన్ కరెంట్ వైర్లు తాకడంతో 70% శరీరం కాలిపోయింది. గమనించిన స్థానికులు ఎంజీఎంకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 29, 2024

సంతాపం ప్రకటించిన ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు

image

రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తంరెడ్డి మరణం పట్ల ఉమ్మడి జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క సంతాపం వ్యక్తం చేశారు. ఒక గొప్ప రాజకీయ నాయకునిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీర్చిదిద్దిన వారు ధన్యులని మంత్రులు అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని మంత్రులు చెప్పారు.

News September 29, 2024

వృద్ధులు మనకు భారం కాదు.. బాధ్యత: మంత్రి సీతక్క

image

వృద్ధులు మనకు భారం కాదు.. బాధ్యత అని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. వృద్ధులను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సీతక్క పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

News September 29, 2024

స్నాతకోత్సవంలో పాల్గొన్న మంత్రి సీతక్క

image

నల్సార్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ జిష్ణు దేవవర్మ, సీఎం రేవంత్ రెడ్డిలతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. అనంతరం పలువురు విద్యార్థులతో మంత్రి సీతక్క మాట్లాడారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.