News August 14, 2025

HNK: రూ.లక్షల్లో డబ్బు స్వాహా.. నిందితుడి అరెస్ట్

image

క్రెడిట్ కార్డ్‌ల ద్వారా కమీషన్ తీసుకోకుండా డబ్బులు ఇప్పిస్తానంటూ బాధితుల నుంచి రూ.లక్షల్లో డబ్బు స్వాహా చేసిన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లికి చెందిన నేరెళ్ల అరుణ్‌ను హన్మకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ట్రాన్సాక్షన్‌కి ఉపయోగించిన మానిటర్, CPU, స్వైపింగ్ మిషన్, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.

Similar News

News August 14, 2025

రెబ్బెన: ‘అక్రమంగా ఇసుక రవాణా’

image

రెబ్బెన మండలం గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సమీపంలోని నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని హిందూ వాహిని యూత్ సభ్యులు తెలిపారు. ఈ నదిలో భక్తులు పుణ్య స్థానాలు ఆచరిస్తుంటారని, ఇసుక ఉండటంతో పర్యాటకంగా బాగుంటుందన్నారు. అక్రమంగా ఇసుకను తరలించడంతో నది బోసిపోయి అసౌకర్యంగా మారుతుందన్నారు. అధికారులు స్పందించకుంటే కలెక్టరేట్ ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.

News August 14, 2025

కర్ణాటక PH.Dలో ప్రవేశం పొందిన ఆదిలాబాద్ విద్యార్థిని

image

ADB పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల పూర్వ విద్యార్థిని తన ప్రతిభను కనబరుస్తూ వస్తుంది. గుడిహత్నూర్ గ్రామం కొల్హారి గ్రామానికి చెందిన ముండే రూమతాయి. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో పీజీ చదువుతూనే యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ చరిత్ర సబ్జెక్ట్‌లో అర్హత సాధించింది. తాజాగా అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోకి అర్హత సాధించి, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో PHDలో చేరింది.

News August 14, 2025

మంచిర్యాల: పంచాయతీ అధికారులతో డీపీఓ సమీక్ష

image

జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వర్ రావ్ డివిజనల్ పంచాయతీ అధికారులు, మండల పంచాయతీ అధికారులతో ఈరోజు సమీక్షించారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై అధికారులతో చర్చించారు. క్షేత్ర స్థాయి అధికారుల తనిఖీలు, పంచాయతీ కార్యదర్శుల అటెండెన్స్, పౌర సేవలు, గ్రామాల్లో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను సమీక్షించాలన్నారు.