News November 13, 2025
HNK: రేపటి నుంచి గ్రంథాలయ వారోత్సవాలు

హనుమకొండ జిల్లా గ్రంథాలయ సంస్థలో రేపటి నుంచి ఈనెల 20 వరకు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఛైర్మన్ అజీజ్ ఖాన్ తెలిపారు. వారం రోజుల పాటు వారోత్సవాలను నిర్వహించి విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించి విజేతలకు ముగింపు రోజు బహుమతులను అందజేయడం జరుగుతుందని, విద్యార్థులు అధిక సంఖ్యలో వారోత్సవాలకు హాజరుకావాలని ఛైర్మన్ పిలుపునిచ్చారు.
Similar News
News November 13, 2025
ఆ ఆలోచన కూడా రాకుండా శిక్షిస్తాం: అమిత్ షా

ఢిల్లీ పేలుడు నిందితులకు విధించే శిక్ష ప్రపంచానికి బలమైన సందేశం పంపుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. మరోసారి అలాంటి అటాక్ చేయాలనే ఆలోచన కూడా రాకుండా శిక్షిస్తామన్నారు. ‘నిందితులపై తీసుకునే చర్యలతో భారత్ ఏ రూపంలోనైనా ఉగ్రవాదాన్ని సహించదని నిరూపిస్తాం. మెసేజ్ క్లియర్.. మనకు హాని కలిగించాలని ప్రయత్నించే వారు ఎవరైనా కఠిన పరిణామాలను ఎదుర్కొంటారు’ అని ఆయన హెచ్చరించారు.
News November 13, 2025
వనపర్తి: ఈనెల 23న పాలమూరులో బీసీల రణభేరి

బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 23న పాలమూరులో బీసీల రణభేరి బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఛైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ మీడియా సమావేశంలో తెలిపారు. అయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చాలని, బీసీ మహిళలకు సబ్‌కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీల హక్కుల పరిరక్షణ కోసం ఈ రణభేరి చరిత్రాత్మక పోరాటానికి నాంది కానుందని తెలిపారు.
News November 13, 2025
కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్ట్.. అప్డేట్ ఇచ్చిన మంత్రి

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ విశాఖలో మాయా వరల్డ్‌ను VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్‌తో కలిసి గురువారం సందర్శించారు. మ్యూజియం వివరాలను మంత్రికి ప్రణవ్ వివరించారు. విశాఖకి వచ్చే పర్యాటకులను, సందర్శకులను ఆకర్షించేలా మ్యూజియంను ఉందని, పర్యాటకానికి చిరునామాగా విశాఖ మారిందన్నారు. కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్ట్‌ను వచ్చే శివరాత్రి నాటికి, గ్లాస్ బ్రిడ్జిను కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.


