News October 13, 2025
HNK: లైంగిక వేధింపులకు పాల్పడిన ఉద్యోగిపై కేసు, వేటు

హనుమకొండ కలెక్టరేట్లో రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ ఇర్ఫాన్ సోహెల్‌పై సుబేదారి స్టేషన్లో SC, ST కేసు నమోదైంది. అదే సెక్షన్లో పని చేస్తున్న ఓ దళిత ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై గతంలోనే కలెక్టర్ ఆయనను సస్పెండ్ చేశారు. బాధితురాలు శనివారం రాత్రి సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Similar News
News October 13, 2025
జగిత్యాలలో CPRపై అవగాహన కార్యక్రమం

CPR వారోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులకు CPRపై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సీపిీఆర్ నేర్చుకుంటే కార్డియాక్ అరెస్ట్ బాధితుల్లో 10 శాతం ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. అదనపు కలెక్టర్లు బీ.ఎస్ లత, బీ.రాజగౌడ్, డాక్టర్ ఎన్.శ్రీనివాస్ పాల్గొన్నారు.
News October 13, 2025
జగిత్యాల: ప్రజావాణిలో 55 ఫిర్యాదుల స్వీకరణ

జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల అర్జీలు స్వీకరించారు. మొత్తం 55 ఫిర్యాదులు వచ్చాయని ఆయన తెలిపారు. ప్రతి ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి త్వరితగతిన పరిష్కారం చూపాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో అ.కలెక్టర్లు BS లత, రాజగౌడ్, RDOలు మధుసూదన్, శ్రీనివాస్, జీవాకర్ రెడ్డి, జిల్లాధికారులు, తహశీల్దార్లు పాల్గొన్నారు.
News October 13, 2025
పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయి: సీపీ

పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. హెడ్ కానిస్టేబుళ్ల నుంచి ఏఎస్సైగా పదోన్నతి పొందిన పోలీస్ అధికారులు సోమవారం కమిషనరేట్లో పోలీస్ కమిషనర్‌ను కలిశారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన పోలీస్ అధికారులను పోలీస్ కమిషనర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రామానుజం తదితరులు పాల్గొన్నారు.