News November 27, 2025
HNK: వన్యప్రాణుల సంరక్షణే ప్రభుత్వ ఎజెండా: మంత్రి

అడవులు, వన్యప్రాణులను సంరక్షించడమే తమ ప్రజా ప్రభుత్వ ఎజెండా అని మంత్రి కొండా సురేఖ తెలిపారు. హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో ఆమె స్టేట్-లెవల్ టైగర్ ప్రొటెక్షన్ అండ్ మానిటరింగ్ సెల్‌ను ప్రారంభించారు. ప్రాణుల మనుగడపైనే మన ఉనికి ఆధారపడి ఉందని ప్రజలు నిత్యం గుర్తుంచుకోవాలని మంత్రి సూచించారు.
Similar News
News December 1, 2025
సిద్ధిపేట: విధుల్లో నిర్లక్ష్యం.. నలుగురికి షోకాజ్ నోటీసులు

సిద్దిపేట జిల్లాలో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన నలుగురు అధికారులకు కలెక్టర్ హైమావతి నోటీసులు ఇచ్చారు. బెజ్జంకి మండల రిటర్నింగ్ అధికారి బాలకిషన్, సహాయ రిటర్నింగ్ అధికారి పరమేశ్వర్‌కు నోటీసులు జారీ చేశారు. వీరికి సరైన రిపోర్ట్ ఇవ్వని మండల పంచాయతీ అధికారులు ఖాజా మొయినొద్దీన్, కలింలకు కూడా నోటీసులు పంపినట్టు తెలిపారు.
News December 1, 2025
WGL: నేటి నుంచి కొత్త మద్యం దుకాణాలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్త మద్యం దుకాణాల్లో నేటి నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. 294 మద్యం షాపులకు టెండర్లను పిలవగా, 10,493 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తు ధరను రూ.3 లక్షలకు పెంచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖాజానాకు రూ.314.79 కోట్ల ఆదాయం జమ అయ్యింది. కొత్త మద్యం షాపులు రెండేళ్ల పాటు ఉండనున్నాయి. కొత్త షాపులకు గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు మేడారం జాతర కలిసి వచ్చేలా చేసింది.
News December 1, 2025
అల్లూరి జిల్లాలో పలుచోట్ల తేలికపాటి జల్లులు

అల్లూరి జిల్లాలో పలుచోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి. ఆదివారం సాయంత్రం నుంచి జిల్లాలో వాతావరణం మారింది. కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి తదితర మండలాల్లో రాత్రి తేలికపాటి వర్షం కురిసింది. సోమవారం ఉదయం కూడా ముసురు వాతావరణం కొనసాగుతుంది. అయితే కొయ్యూరు తదితర మండలాల్లో వరిపంట పండిపోయి కోత దశలో ఉంది. కొన్నిచోట్ల రైతులు పంట కోతలు కోస్తున్నారు. వర్షం పడుతుండడంతో ఆందోళన చెందుతున్నారు.


