News May 5, 2024
HNK: వరకట్నం వేధింపులు.. ప్రభుత్వ ఉద్యోగిని సూసైడ్
వరకట్నం వేధింపులు, కుటుంబ కలహాలతో ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన HNKలో జరిగింది. పోలీసుల వివరాలు.. ములుగు జిల్లా మంగపేట మం. బోరు నర్సాపూర్‌కు చెందిన రాంనర్సయ్యకు ఏటూరునాగారంకు చెందిన సఫియా(38)తో వివాహమైంది. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. రాంనర్సయ్య చెడు వ్యసనాలకు బానిసై భార్యను శారీరకంగా, మానసికంగా వేధించాడు. పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని హింసించడంతో సఫియా శనివారం ఉరేసుకుంది.
Similar News
News January 16, 2025
నేటి నుంచి అన్నారం ఉర్సు ఉత్సవాలు
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని అన్నారం హజ్రత్ సయ్యద్ యాకుబ్ షావలి దర్గా ఉత్సవాలు గురువారం నుంచి ఘనంగా జరగనున్నాయి. ఈనెల 16న గంధం, 17న దీపారాధన, 18న ఖత్ మే ఖురాన్ ఉత్సవాలు జరగనున్నాయి. మత సామరస్యానికి ప్రతీకగా అన్నారం దర్గా నిలుస్తోంది. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉత్సవాలకు విచ్చేస్తుంటారు. మీరూ ఉర్సు ఉత్సవాలకు వెళ్తే కామెంట్ చేయండి.
News January 16, 2025
రెండు జాతరల్లో మెరుగైన వైద్య సేవలు: DMHO
హనుమకొండ జిల్లాలో జరుగుతున్న రెండు (ఐనవోలు, కొత్తకొండ) జాతరల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు DMHO డా.అల్లం అప్పయ్య తెలిపారు. ఐనవోలులో 50 మంది, కొత్తకొండలో 40 మంది వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు, స్టాఫ్ నర్సులు, హెల్త్ అసిస్టెంట్లు ANMలు, MNOలు ఆశాలు 3 షిఫ్టులలో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు కొత్తకొండ జాతరలో 1,071, ఐనవోలులో 3,728 మందికి సేవలందించామన్నారు.
News January 15, 2025
రేపు వరంగల్ మార్కెట్ పునఃప్రారంభం
ఐదు రోజుల సుదీర్ఘ విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ గురువారం పున: ప్రారంభం కానుంది. శని, ఆదివారం వారాంతపు యార్డు బంద్, సోమ, మంగళ, బుధవారం సంక్రాంతి సందర్భంగా మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. ఉ. 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.