News April 7, 2025

HNK: 9 నుంచి ప్రాక్టికల్ తరగతులు

image

కాకతీయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 9 నుంచి 11 వరకు డిగ్రీ బీఎస్సీ, ఎంఎస్సీ, సీఎస్ కోర్సుల మొదటి సంవత్సరం సెమిస్టర్ ప్రాక్టికల్ తరగతులు జరుగుతాయని దూరవిద్య సంచాలకులు ఆచార్య సురేష్ లాల్, సహాయ సంచాలకులు వెంకట్ గోపీనాథ్ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News November 2, 2025

అన్నమయ్య: ‘నాకు కారుణ్య మరణాన్ని ప్రసాదించండి’

image

కోడూరు వ్యాపారి మోహన్ రాజు వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక కారుణ్య మరణం కోరుతూ దుకాణం ముందు బోర్డు పెట్టారు. కరోనాలో వ్యాపారం నష్టపోయి, అప్పులు చెల్లించలేక ఐపీ పెట్టాల్సి వచ్చిందని తెలిపారు. కొంతమందికి బకాయిలు చెల్లించినా, బాండ్లు, చెక్కులు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

News November 2, 2025

ఫైనల్లో గెలిచి భారత ఫ్యాన్స్‌ను సైలెంట్ చేస్తాం: దక్షిణాఫ్రికా కెప్టెన్

image

WWC ఫైనల్లో హర్మన్ సేనను ఓడించి భారత ఫ్యాన్స్‌ను సైలెంట్ చేస్తామని దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ అన్నారు. ఇరు జట్లపై తీవ్ర ఒత్తిడి ఉందని, గత రికార్డులను పరిగణనలోకి తీసుకోకుండా మ్యాచ్‌ను ఫ్రెష్‌గా ప్రారంభిస్తామన్నారు. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండే వారే ఫైనల్లో ముందంజ వేస్తారని పేర్కొన్నారు. ఇవాళ మ.3.00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 2023 WC ఫైనల్ ముందు కమిన్స్ సైతం ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.

News November 2, 2025

MBNR: అక్టబర్‌లో 21 రెడ్‌హ్యాండెడ్ కేసులు

image

జిల్లా ఎస్పీ డి.జానకి ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ జిల్లాలో అక్టోబర్ నెలలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు, నిఘా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మొత్తం 28 ఫిర్యాదులు వచ్చాయి. కౌన్సిలింగ్- 23, రెడ్‌హ్యాండెడ్ కేసులు- 21, FIR- 5, ఈ- పెట్టీ కేసులు- 2, అవగాహన కార్యక్రమాలు- 16, హాట్‌స్పాట్ విజిట్స్- 86, విద్యాసంస్థల్లో ర్యాగింగ్, ఇవ్టీజింగ్, పోక్సో, SM, సెల్ఫ్ డిఫెన్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.