News April 7, 2025
HNK: 9 నుంచి ప్రాక్టికల్ తరగతులు

కాకతీయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 9 నుంచి 11 వరకు డిగ్రీ బీఎస్సీ, ఎంఎస్సీ, సీఎస్ కోర్సుల మొదటి సంవత్సరం సెమిస్టర్ ప్రాక్టికల్ తరగతులు జరుగుతాయని దూరవిద్య సంచాలకులు ఆచార్య సురేష్ లాల్, సహాయ సంచాలకులు వెంకట్ గోపీనాథ్ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News July 5, 2025
నీలాక్రమం అలంకరణ భద్రకాళి అమ్మవారు

శనివారం సందర్భంగా భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. నీలాక్రమం అలంకరణలో నేడు భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. అమ్మవారికి విశేష పూజలు చేసి హారతి ఇచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయం చేరుకుని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.
News July 5, 2025
‘మహా’ రాజకీయాల్లో కీలక పరిణామం

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే సోదరులు మరాఠీ భాష కోసం ఒక్కటి కాబోతున్నారు. కేంద్రం తీసుకొచ్చిన 3 లాంగ్వేజ్ ఫార్ములాను వ్యతిరేకిస్తూ MH నవనిర్మాణ సేన చీఫ్ రాజ్, శివసేన(UBT) అధినేత ఉద్ధవ్ ఇవాళ సంయుక్తంగా మెగా ర్యాలీ చేపట్టనున్నారు. 2 దశాబ్దాల తర్వాత వీరు కలుస్తుండటంతో రాష్ట్రంలో కొత్త రాజకీయ పొత్తు ఉదయిస్తుందా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
News July 5, 2025
భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 108.2 మి.మీ వర్షపాతం

గడిచిన 24 గంటల్లో భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 108.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మండలాల వారీగా చూస్తే మహదేవ్‌పూర్ 9.2 మి.మీ, పలిమెల 32.8, మహముత్తారం 42.4, కాటారం 3.6, మల్హర్ 10.4, చిట్యాల 3.2, టేకుమట్ల 1.0, రేగొండ 1.4, భూపాలపల్లి 4.2 మి.మీ.లుగా నమోదైంది.