News March 27, 2025

HNK: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

image

TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం WGL, HNK, MLG, JN, BHPL, MHBD డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు. జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై చర్చించారు. కాంగ్రెస్ పై BRSచేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని చెప్పినట్లు సమాచారం. కాగా నేడు డీసీసీలతో ఢిల్లీలో అధిష్ఠానం సమావేశం కానుంది.

Similar News

News December 4, 2025

గజ్వేల్: ‘అట్రాసిటీ కేసుల పట్ల నిర్లక్ష్యం వీడాలి’

image

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పట్ల పోలీస్, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వీడాలని దళిత బహుజన ఫ్రంట్(డీబీఎఫ్) జాతీయ కార్యదర్శి పి. శంకర్ డిమాండ్‌ చేశారు. గజ్వేల్ అంబేద్కర్ భవన్‌లో ఎస్సీ, ఎస్టీ అత్యాచార బాధితుల, సాక్షుల సమావేశం నిర్వహించారు. సిద్దిపేట జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శించారు. బాధితులకు తక్షణ న్యాయం అందించాలని కోరారు.

News December 4, 2025

గోల్డ్ లోన్? పర్సనల్ లోన్? ఏది బెటర్

image

మీ దగ్గర బంగారం ఉంటే గోల్డ్ లోన్ తీసుకోవడం గుడ్ ఛాయిస్. అత్యవసరంగా డబ్బులు అవసరమైతే బంగారం తాకట్టు పెట్టి బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు. తనఖా పెట్టిన కొద్దిసేపటికే డబ్బులు అకౌంట్‌లో డిపాజిట్ అవుతాయి. నెల నెలా వడ్డీ కట్టే సమస్య ఉండదు. సంవత్సరం చివరిలో లేదంటే మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చెల్లించి మీ బంగారం వెనక్కి తీసుకోవచ్చు. పర్సనల్ లోన్ EMI చెల్లింపు మిస్ అయితే వడ్డీ ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది.

News December 4, 2025

రష్యాకు ఫుడ్.. మనకు ఆయిల్!

image

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ముడిచమురు దిగుమతిదారు భారత్. ఉక్రెయిన్‌తో యుద్ధం తర్వాత రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో ఆ దేశం నుంచి ఆయిల్‌ను IND అతితక్కువ ధరకే కొనుగోలు చేస్తోంది. ఈ డీల్‌ను మరో ఎత్తుకు తీసుకెళ్లేందుకు పుతిన్ పర్యటనలో ఒప్పందం కుదరనుంది. ‘ఫుడ్ ఫర్ ఆయిల్’ డీల్‌ $60 బిలియన్లకు పెరగనుంది. దీని ప్రకారం భారత్ వ్యవసాయ ఉత్పత్తులను రష్యాకు ఎగుమతి చేస్తే.. ఆ దేశం ఆయిల్‌ను పంపనుంది.