News August 17, 2024

HNK: అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం

image

హనుమకొండలోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ(డైట్)లో అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ డి.వాసంతి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫిలాసఫీ, సోషియాలజీ, సైకాలజీ, (ఉర్దూ), సైన్స్ సంబంధిత సబ్జెక్టులలో పీజీతో పాటు ఎంఈడీ అర్హత ఉన్నవారు ఈ నెల 21 వరకు డైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.

Similar News

News September 30, 2024

వరంగల్: ప్రజావాణికి భారీగా తరలి వచ్చిన ఫిర్యాదుదారులు

image

వరంగల్ జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి ఫిర్యాదులను సోమవారం కలెక్టర్ సత్య శారద స్వీకరించారు. ప్రజావాణిలో మొత్తం దరఖాస్తులు 103 రాగా.. వాటిని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేస్తూ ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖకి సంబంధించి భూ సంబంధిత సమస్యలపై 53, జిల్లా విద్యా శాఖ, GWMCకి 6, వ్యవసాయ శాఖకి 5 దరఖాస్తులు వచ్చాయని, మిగతావి వివిధ శాఖలకు సంబంధించినవన్నారు.

News September 30, 2024

WGL: నేటి నుంచి టీచర్ ఓటర్ల నమోదు ప్రక్రియ

image

వరంగల్-నల్గొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానం కాల పరిమితి మార్చి-29తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎలెక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు 108-భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి మండలానికి సంబంధించిన టీచర్ ఓటర్ల నమోదు ప్రక్రియ ఈనెల 30 నుంచి ప్రారంభం కానుందని తహశీల్దార్ తెలిపారు. కావున అర్హులయిన టీచర్లు అందరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని తెలిపారు.

News September 30, 2024

వినతలను స్వీకరించిన వరంగల్ కలెక్టర్

image

వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ సత్యశారదాదేవి వినతులను స్వీకరించారు. ప్రజావాణి వినతులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజల వద్ద నుంచి కమిషనర్ అశ్విని తానాజీ వాకడే వినతులను స్వీకరించారు.