News April 8, 2025
HNK: ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు రింగ్ రోడ్డు బ్రిడ్జి వద్ద తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒంగోలు నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లే లహరి ఎక్స్‌ప్రెస్ బస్సుగా గుర్తించారు. గాయాలైన వారిని చికిత్స కోసం 108 ద్వారా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 19, 2025
ఖమ్మం: బావిలో పడి మతిస్థిమితం లేని వ్యక్తి మృతి

బావిలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. మండలం మేడిదపల్లి గ్రామంలో మతిస్థిమితం లేని వ్యక్తి బావిలో పడి మృతి చెందినట్లు చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
News April 19, 2025
HYD: ఏడాదికి 2 సార్లు పీహెచ్డీ నోటిఫికేషన్..!

కూకట్‌పల్లి JNTUH యూనివర్సిటీలో ఇక నుంచి ఏటా 2 సార్లు PhD ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు అధికారులు నిర్ణయించారు. అంతేకాక రీసెర్చ్ స్కాలర్ విద్యార్థుల పర్యవేక్షణకు సూపర్వైజర్లను అందించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు JNTUH అఫిలియేటెడ్ కాలేజీల్లో IIT, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో PhD పూర్తి చేసిన వారిని సెలెక్ట్ చేయనున్నారు.
News April 19, 2025
కొత్తగూడెం: ట్రాక్టర్ ఢీకొని రెండేళ్ల చిన్నారికి తీవ్రగాయాలు

భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం బేతాళపాడు గ్రామంలో శుక్రవారం విషాదం నెలకొంది. అక్రమ మట్టితవ్వాకాలు నిర్వహిస్తున్న ట్రాక్టర్ ఢీకొని రెండేళ్ల చిన్నారి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు చెప్పారు. చికిత్స నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు అక్కడి నుంచి హైదరాబాద్ తరలించినట్లు సమాచారం.