News April 23, 2025
HNK: ఇంటర్ ఫలితాల్లో ‘వేలేరు గురుకులం’ విజయదుందిబి!

ఇంటర్మీడియట్ ఫలితాల్లో HNK జిల్లా వేలేరు గురుకుల కళాశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించి విజయదుందుబి మోగించారు. ఎంపీసీలో నందకిషోర్ 986/1000 మార్కులతో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంక్ సాధించారు. బైపీసీలో రాహుల్‌కు 980/1000 మార్కులు లభించాయి. ఎంపీసీలో సాయి గణేశ్ 464/470 మార్కులు, బైపీసీలో శశాంత్ 420/440 మార్కులు సాధించారు. విద్యార్థులను, స్టాఫ్‌ను ప్రిన్సిపల్ డాక్టర్ అజయ్ కుమార్ అభినందించారు.
Similar News
News April 23, 2025
కుల్గాంలో భీకర ఎన్‌కౌంటర్.. TRF కమాండర్ ట్రాప్

జమ్మూ కశ్మీర్‌లో భీకర ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. కుల్గాంలోని టంగ్‌మార్గ్‌లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. పహల్‌గామ్ దాడికి కారణమైన TRF ఉగ్రవాదుల కమాండర్ అసిఫ్ ఫౌజీని ట్రాప్ చేశారు. టెర్రరిస్టులు తలదాచుకున్న ప్రాంతాన్ని అన్నివైపుల నుంచి బలగాలు చుట్టుముట్టాయి. కాగా ఈ దాడుల్లో అసిఫ్ ఫౌజీ నేరుగా పాల్గొన్నట్లు వార్తలు వస్తున్నాయి.
News April 23, 2025
కామారెడ్డి: నెలవారీ నేర సమీక్ష

కామారెడ్డి జిల్లా SP రాజేశ్ చంద్ర జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. SP మాట్లాడుతూ.. పెండింగ్ (అండర్ ఇన్వెస్టిగేషన్)లో ఉన్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు పరిమితికి లోబడి ఉండాలని, గ్రేవ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ విషయంలో SOP కూడళ్లలో, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
News April 23, 2025
రేపు హనుమకొండ జిల్లాకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హనుమకొండ జిల్లాకు రేపు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రానున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పలు కార్యక్రమాల్లో కవిత పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఎల్కతుర్తిలో BRS రజతోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించనున్నారు. ఎమ్మెల్సీ కవిత పర్యటనకు సంబంధించి నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.