News March 30, 2025

HNK: జిల్లా ప్రజలకి ఉగాది శుభాకాంక్షలు తెలిపన కలెక్టర్

image

జిల్లా కలెక్టర్ పి.ప్రవీణ్య జిల్లా ప్రజలకు నూతన సంవత్సరాది ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వారి పండుగలు ఉగాది పండుగతోనే మొదలవుతాయని శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ జిల్లా ప్రజలందరి జీవితంలో కొత్త వెలుగులు నింపాలన్నారు. ప్రజల జీవితాల్లో విజయాలు, సంపదలు, సంతృప్తి సమృద్ధిగా సమకూరాలని, యువత కొత్త ఆశయాలు, ఆలోచనలతో ముందుకు సాగాలని, జిల్లా ప్రజలందరికీ కొత్త వెలుగు నింపాలని కోరారు.

Similar News

News April 2, 2025

CMను కలిసిన నాగబాబు

image

AP: వెలగపూడి సచివాలయంలో CM చంద్రబాబును జనసేన MLC నాగబాబు భార్యతో సహా కలిశారు. MLCగా ప్రమాణ స్వీకారం అనంతరం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నాగబాబును శాలువా కప్పి సీఎం సత్కరించారు. సీఎం, డిప్యూటీ సీఎం తనకు అవకాశం కల్పించి, అప్పజెప్పిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తానని నాగబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

News April 2, 2025

KMR: కలెక్టరేట్లో సర్దార్ పాపన్న గౌడ్ వర్ధంతి

image

కామారెడ్డి కలెక్టరేట్‌లో బుధవారం సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పుష్పాంజలి ఘటించారు. ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేసి సమాజ స్థాపన చేసిన మహనీయుడని కొనియాడారు. బీసీ సంక్షేమ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, చందర్ తదితరులు పాల్గొన్నారు.

News April 2, 2025

విజయనగరం: ‘ఉద్యాన‌ పంటల సాగు పెంచేందుకు కార్యాచ‌ర‌ణ‌’

image

విజయనగరం జిల్లాలో ఉద్యాన పంట‌ల సాగును పెంచేందుకు 15 రోజుల్లోగా కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌స్తుత జిల్లా ప‌రిస్థితులను బ‌ట్టి వ్య‌వ‌సాయ‌, అనుబంధ శాఖ‌ల ద్వారా జిడిపి పెంచేందుకు కృషి చేయాల‌ని ఆయ‌న సూచించారు. ఉద్యాన‌సాగు, సూక్ష్మ సేద్యంపై కలెక్టర్ బుధవారం త‌మ క్యాంపు కార్యాల‌యంలో కలెక్టర్ స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు.

error: Content is protected !!