News March 15, 2025
HNK: జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్..

✓ ధర్మసాగర్: వ్యక్తి అనుమానస్పద మృతి
✓ రాయపర్తి: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి
✓ భార్యను చంపిన భర్తకు రిమాండ్(UPDATE)
✓ హనుమకొండలో రేషన్ బియ్యం పట్టివేత
✓ ఉనికిచర్ల శివారులో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
✓ HNK: వాహన తనిఖీలు నిర్వహించిన సుబేదారి పోలీసులు
✓ HNK: ATM సెంటర్ల వద్ద పోలీసుల ప్రత్యేక నిఘా
Similar News
News March 15, 2025
బాపట్ల జిల్లాలో ఒంటిపూట బడులు: DEO

బాపట్ల జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు నేటి నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఉదయం 07:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. SSC పరీక్షా కేంద్రాలుగా కేటాయించిన పాఠశాలలు మాత్రం పరీక్షలు పూర్తయ్యే వరకు మధ్యాహ్నం 1 గంటల నుంచి 5గంటల వరకు బడి నిర్వహించాలన్నారు.
News March 15, 2025
తొక్కిసలాట ఘటనపై ఎల్లుండి నుంచి విచారణ

AP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ ఛైర్మన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్నారు. ఇవాళ, రేపు క్యూలైన్ల నిర్వహణ తీరును ఆయన పరిశీలించనున్నారు. ఎల్లుండి నుంచి టీటీడీ, పోలీసు, రెవెన్యూ సిబ్బందితో పాటు గాయపడినవారిని విచారించనున్నారు. ఇప్పటికే ఈ నెల 17న విచారణకు రావాలని కలెక్టర్‌తో పాటు ఎస్పీ, టీటీడీ ఈవోకు నోటీసులు పంపారు.
News March 15, 2025
నేటి నుంచి ఒంటిపూట బడులు.. మ.12.30 గంటల వరకే స్కూళ్లు

తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. తెలంగాణలో ఉ.8 గంటల నుంచి మ.12:30 గంటల వరకు క్లాసులు నిర్వహించాలని ఆదేశించారు. పదోతరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో మ.1:00 నుంచి సా.5:00 గంటల వరకు క్లాసులు జరగనున్నాయి. ఇక ఏపీలో ఉ.7:45 నుంచి మ.12:30 బడులు కొనసాగనున్నాయి. పదోతరగతి పరీక్ష కేంద్రాలున్న స్కూళ్లలో మ.1:15 నుంచి సా.5 గంటల వరకు తరగతులు ఉంటాయి.