News February 24, 2025

HNK: మందుబాబులకు బ్యాడ్ న్యూస్

image

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మూడు రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. దీంతో వరంగల్, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, ములుగు, హనుమకొండ జిల్లాల్లోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ అవుతాయి.

Similar News

News February 24, 2025

వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

image

వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారిని సోమవారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. దీంతో ఆలయం భక్తులతో కోలాహలంగా మారి దర్శనమిస్తుంది. దర్శనంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకున్నారు. మహాశివరాత్రి జాతరకు ముందు వచ్చే సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నట్లు తెలుస్తుంది.

News February 24, 2025

సిరిసిల్ల: వ్యక్తిపై కేసు నమోదు: ఎస్పీ

image

మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. వేములవాడ దేవాలయానికి సంబంధించి సామాజిక మాధ్యమాలలో మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు చేసిన నూనె ముంతల రవీందర్ గౌడ్ (43) పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.

News February 24, 2025

శ్రీకాళహస్తీశ్వరునికి పట్టువస్త్రాల సమర్పించనున్న మంత్రి ఆనం 

image

శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి ప్రభుత్వం తరుఫున మంత్రి ఆనం పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మొదటి నుంచి సీఎం చంద్రబాబు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ప్రచారం జరిగినా చివరికి ఆనం ఇవ్వనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి 25వతేది(మంగళవారం)   స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించున్నారు. 

error: Content is protected !!