News March 13, 2025

HNK: యూత్ కాంగ్రెస్ ఇంచార్జులుగా రాహుల్, అశ్విన్ రాథోడ్

image

HNK జిల్లా యూత్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జులుగా రాహుల్, అశ్విన్ రాథోడ్ నియమితులయ్యారు. యూత్ కాంగ్రెస్ ఇన్‌‌ఛార్జులుగా నియమితులైన వారికి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి యూత్ కాంగ్రెస్ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా అధ్యక్షులు పిలుపునిచ్చారు.

Similar News

News March 13, 2025

అందరూ సమష్టిగా పని చేయాలి: RJD

image

అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశాల మేరకు స్థానిక SSBN డిగ్రీ కళాశాలలోని వర్చువల్ రూమ్‌లో CS, DOలకు వర్చువల్ ప్రోగ్రామ్ జరిగింది. పదో పరీక్షలు ఈనెల 17 నుంచి ప్రారంభం కానున్నాయని RJD శ్యామ్యూల్ తెలిపారు. చీప్ సూపర్వైజర్, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరూ సమష్టిగా పని చేయాలన్నారు. పరీక్ష కేంద్రంలోకి స్మార్ట్ వాచ్, ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లరాదని సూచించారు.

News March 13, 2025

NZB: 651 మంది విద్యార్థుల గైర్హాజరు

image

నిజామాబాద్ జిల్లాలో గురువారం నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథ్స్, జువాలజీ, హిస్టరీ-1 పరీక్షకు మొత్తం 651 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని నిజామాబాద్ DIEO రవికుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 18,197 మంది విద్యార్థులకు 17,546 మంది పరీక్షలకు హాజరయ్యారన్నారు. పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయని రవి కుమార్ వివరించారు.

News March 13, 2025

ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి: ఎస్పీ

image

జిల్లాలోని ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో హోలీని జరుపుకోవాలని గురువారం జిల్లా ఎస్పీ వి.రత్న తెలిపారు. ఈ సందర్భంగా ముందుగా అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఉన్నాయని, ఎవరూ గొడవలకు వెళ్లకూడదని తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో ప్రజలకు స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా ప్రవర్తించరాదన్నారు.

error: Content is protected !!