News April 9, 2025

HNR మహిళకు మోదీ ప్రశంసా పత్రం 

image

తెలంగాణ నుంచి జిల్లా లీడ్ బ్యాంకులో ముద్ర లోన్ పొంది వ్యాపారంలో రాణించి ఆర్థిక స్వాలంబన సాధించిన హుజూర్‌నగర్ వాసి సృజన సురేష్ రెడ్డికి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసా పత్రం అందజేశారు. ప్రధానమంత్రి ముద్ర యోజన దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆమె ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సృజనను పలువురు అభినందించారు.

Similar News

News December 2, 2025

పెనుగంచిప్రోలు: అమ్మవారి దర్శనం ఇక ఆన్‌లైన్‌లో

image

పెనుగంచిప్రోలు అమ్మవారి దర్శనం, సేవలను ఇకపై ఆన్‌లైన్‌లో పొందవచ్చని ఈవో కిషోర్ కుమార్ తెలిపారు. దర్శనం టిక్కెట్లు, ప్రసాదం టిక్కెట్లతో పాటు ఇతర సేవలను https://www.aptemples.org వెబ్‌సైట్ లేదా 9552300009 వాట్సాప్ ద్వారా బుక్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. అన్నదానం, గోసంరక్షణ వంటి పథకాలకు క్రెడిట్/డెబిట్ కార్డులు, యూపీఐ (Google Pay, Phone Pe, Paytm, BHIM) ద్వారా కూడా విరాళాలు చెల్లించవచ్చని తెలిపారు.

News December 2, 2025

నార్మల్ డెలివరీల్లో ‘కరీంనగర్ TOP’

image

PHCలలో అత్యధిక నార్మల్ డెలివరీలు చేస్తూ రాష్ట్రానికి KNR(D) ఆదర్శంగా నిలుస్తోంది. 2024-25 ఏడాదికి గాను రికార్డు స్థాయిలో 256 నార్మల్ డెలివరీలు చేసి KNRను నం. 1 స్థానంలో నిలిపారు. కాగా కలెక్టర్ ప్రత్యేకంగా రూపొందించిన శుక్రవారం సభ కార్యక్రమం ద్వారానే ఈ ఘనత సాధ్యమైనట్లు స్పష్టమవుతోంది. ఈ ప్రోగ్రాం ద్వారా గర్భిణీలపై పర్యవేక్షణ, పోషకాహారం, డెలివరీ టైంలో పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు.

News December 2, 2025

పల్నాడు: ప్రభుత్వ సంస్థల మొండి బకాయిలు

image

జిల్లాలోని మున్సిపాలిటీలకు ప్రైవేట్ సంస్థల కంటే ప్రభుత్వ సంస్థల నుంచే ఆస్తి పన్ను మొండి బకాయి అధికంగా ఉంది. నరసరావుపేట (₹3 కోట్లు), సత్తెనపల్లి (₹1.05 కోట్లు), మాచర్ల (రూ.1 కోటి) చిలకలూరిపేట (రూ.80 లక్షలు), వినుకొండ (రూ.46 లక్షలు) సహా పలు మున్సిపాలిటీలకు మొత్తం ₹52.36 కోట్ల ఆస్తి పన్ను రావాల్సి ఉంది. ఈ బకాయిల వసూలు మున్సిపల్ అభివృద్ధికి ఆటంకంగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.