News August 2, 2024
HOCKEY: ఆసీస్పై భారత్ విజయం.. 52ఏళ్లలో తొలిసారి

పారిస్ ఒలింపిక్స్ పూల్ మ్యాచ్లో భారత్ సత్తా చాటింది. ఆస్ట్రేలియాపై 3-2 తేడాతో విజయం సాధించి రికార్డ్ సృష్టించింది. ఒలింపిక్స్లో ఆస్ట్రేలియాపై భారత్ గెలవడం 52ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. పూల్ బీలో రెండో స్థానాన్ని కైవసం చేసుకోవడంలో ఈ విజయం కీలక పాత్ర పోషించింది. <<-se>>#Olympics2024<<>>
Similar News
News January 30, 2026
ఫిబ్రవరి 1 నుంచి ఇవి మారుతాయి..

ఫిబ్రవరి 1 నుంచి పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి.
*ఫాస్టాగ్ను <<18735050>>యాక్టివేట్<<>> చేసిన తర్వాత అదనంగా KYC/KYV వెరిఫికేషన్ అవసరం లేదు.
*పాన్ మసాలా, <<18730084>>సిగరెట్లు<<>>, పొగాకు ధరలు పెరగనున్నాయి.
*LPG సిలిండర్, CNG, PNG, విమాన ఇంధన ధరల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది.
*కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. పన్ను విధానంలో మార్పులు జరగొచ్చు. ఆదివారమైనా స్టాక్ మార్కెట్ ఓపెన్లో ఉంటుంది.
News January 30, 2026
కందిలో ఆకుగూడు పురుగు – నివారణకు సూచనలు

కంది పంట ఎదుగుదల దశలో ఎక్కువగా, ఒక్కోసారి పూత దశలో కూడా ఆకుగూడు పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగు లార్వాలు కంది మొక్కల చిగురు ఆకులను గూడుగా చేసి, లోపల ఉండి ఆకులను, పువ్వులను, లేత కాయలను కూడా తొలిచి తింటాయి. ఈ పురుగు నివారణకు లీటరు నీటిలో క్వినాల్ఫాస్ 25% ఇ.సి. 2.0 మి.లీ. (లేదా) మోనోక్రోటోఫాస్ 36% యస్.యల్ 1.6 మి.లీ. కలిపి పంటపై పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
News January 30, 2026
NCP రెండు వర్గాలు విలీనం.. FEB రెండో వారంలో ప్రకటన?

మహారాష్ట్ర Dy.CM అజిత్ పవార్ మరణంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. NCP, NCP-SP వర్గాల రీయూనియన్పై FEB రెండో వారంలో ప్రకటన రావొచ్చని సమాచారం. కొన్ని నెలలుగా అజిత్-శరద్ మధ్య దీనిపై చర్చలు జరిగాయని తెలుస్తోంది. NCP విలీనమై మహాయుతిలోనే కొనసాగే అవకాశం ఉంది. రాష్ట్రస్థాయిలో సునేత్రా/ప్రఫుల్, జాతీయ స్థాయిలో శరద్ పార్టీని లీడ్ చేస్తారని టాక్. ఇదే జరిగితే మహా వికాస్ అఘాడీకి షాక్ తప్పదు.


