News April 2, 2025

రిటైర్మెంట్ ప్రకటించిన హాకీ ప్లేయర్

image

భారత మహిళల హాకీ జట్టు తరఫున అత్యధిక మ్యాచులు ఆడిన వందన కటారియా అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. హాకీ ఇండియా లీగ్‌లో మాత్రమే ఆడతానని తెలిపారు. మొత్తం 320 మ్యాచులు ఆడిన వందన 158 గోల్స్ చేశారు. ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ గోల్ చేసిన భారత తొలి మహిళా ప్లేయర్‌గా రికార్డు సృష్టించారు. క్రీడా సేవలకు గుర్తుగా ఆమెను పద్మశ్రీ, అర్జున అవార్డులు వరించాయి.

Similar News

News November 24, 2025

భారతీయ వైద్యం వైపు అమెరికన్ల మొగ్గు!

image

అమెరికాతో పోల్చితే ఇండియాలో వైద్య సదుపాయం చాలా బెటర్ అని వైద్యులు చెబుతున్నారు. ఈక్రమంలో పెరుగుతున్న ఖర్చులు, వెయిటింగ్ కారణంగా అమెరికా వంటి పాశ్చాత్య దేశాల రోగులు భారతీయ వైద్యం వైపు మళ్లుతున్నట్లు పేర్కొన్నారు. ‘భారత్‌లో అత్యల్ప ఖర్చు, తక్షణ అపాయింట్‌మెంట్‌లు (సూపర్ స్పెషలిస్ట్‌లతో సహా), MRI/CT స్కాన్ల వంటి త్వరిత డయాగ్నస్టిక్ సేవల వల్ల రోగులకు మెరుగైన సేవలు అందుతున్నాయి’ అని తెలిపారు.

News November 24, 2025

పెరిగిన మంచు తీవ్రత.. మినుము పంటకు తెగుళ్ల ముప్పు

image

గాలిలో అధిక తేమ, మంచు, మబ్బులతో కూడిన వాతావరణం వల్ల మినుము పంటలో.. కాయ దశలో ఆకు మచ్చ తెగులు మరియు బూడిద తెగులు ఆశించే అవకాశం ఉంది. ఆకుమచ్చ తెగులు నివారణకు లీటరు నీటికి హెక్సాకొనజోల్ 2 మి.లీ. లేదా ఒక మి. లీ ప్రాపికొనజోల్ 1ml కలిపి పిచికారీ చేయాలి. వీటితో పాటు లీటరు నీటికి 1ml మైక్లోబుటానిల్ పిచికారీ చేసి బూడిద తెగులును కూడా నివారించవచ్చని వ్యవసాయ నిపుణులు తెలిపారు.

News November 24, 2025

స్థానిక ఎన్నికల తేదీలపై 25న క్యాబినెట్ నిర్ణయం!

image

TG: కోర్టుల ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికల్లో 50%లోపు రిజర్వేషన్లను ఖరారు చేశారు. పంచాయతీల రిజర్వేషన్లపై ఇవాళ కలెక్టర్లు గెజిట్‌ నోటిఫికేషన్లు జారీ చేస్తారు. కాగా హైకోర్టు ఉత్తర్వులను బట్టి షెడ్యూలు, నోటిఫికేషన్‌ విడుదలపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే మూడు దశల్లో నిర్వహణకు ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ నెల 25న జరిగే మంత్రివర్గ భేటీలో తేదీలు ఖరారయ్యే అవకాశం ఉంది.