News October 6, 2024

Air Indiaపై హాకీ క్రీడాకారిణి ఫైర్

image

విమాన‌యాన సంస్థ‌ల సిబ్బంది ప్ర‌యాణికుల ల‌గేజీపై ఎంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తారన్నది సామాన్యుల‌కు తెలిసిందే. ఈ అనుభవం ఇప్పుడు స్టార్ హాకీ క్రీడాకారిణి రాణీ రాంపాల్‌కు ఎదురైంది. ఇటీవ‌ల అమె Air India విమానంలో కెనాడా నుంచి ఢిల్లీ వ‌చ్చారు. అయితే, ఆమె లగేజీ ధ్వంసమ‌వ్వ‌డంపై మండిపడ్డారు. ‘మీ అద్భుతమైన బ‌హుమానానికి ధ‌న్య‌వాదాలు. మీ సిబ్బంది మా బ్యాగ్‌లను ఇలా చూస్తారు?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Similar News

News March 19, 2026

నేడే జాబ్ క్యాలెండర్.. 5 శాఖల్లో 8,340 పోస్టులు!

image

AP: రాష్ట్ర ప్రభుత్వం నేడు 10 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది. ఇందులో 5 శాఖల్లోనే 8,340 ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. అత్యధికంగా విద్యాశాఖలో 4,500 పోస్టులు ఉన్నాయని సమాచారం. వర్సిటీల్లో 1,500, DSC, ఇతర పోస్టులు 3 వేలు, హోంశాఖలో 3 వేలు, ఎక్సైజ్ శాఖలో 450 ఉద్యోగాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలో 4 దశల్లో వీటిని భర్తీ చేసే అవకాశం ఉంది. మంత్రి లోకేశ్ ఈ క్యాలెండర్‌ను రిలీజ్ చేయనున్నారు.

News March 19, 2026

కొత్త డీజీపీ రేసులో ముగ్గురు!

image

TG: డీజీపీ నియామకానికి అర్హులైన ముగ్గురు అధికారుల లిస్టు రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. సీవీ ఆనంద్(1991 బ్యాచ్), వినయ్ ప్రభాకర్ ఆప్టే(1994 బ్యాచ్), సౌమ్యా మిశ్రా(1994 బ్యాచ్)తో కూడిన ఫైనల్ లిస్టును యూపీఎస్సీ పంపింది. ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీవీ ఆనంద్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. డీజీపీ శివధర్ రెడ్డి పదవీ కాలం ఏప్రిల్ 30తో ముగియనుంది.

News March 19, 2026

ALERT: ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడతాయని APSDMA హెచ్చరించింది. శ్రీకాకుళం, VZM, మన్యం, అల్లూరి, పోలవరం, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, NLR, కర్నూలు, నంద్యాల, ATP, సత్యసాయి, కడప, చిత్తూరు, TPTYలో తేలికపాటి-మోస్తరు వర్షాలు, మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. కాగా చిత్తూరు, కడపలోని పలు ఏరియాల్లో ఇప్పటికే వర్షం కురుస్తోంది.