News June 11, 2024

భారత్‌లో ‘హాకీ వరల్డ్ కప్’

image

భారత్ మరో కీలక టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. FIH పురుషుల జూనియర్ వరల్డ్ కప్ టోర్నీ భారత గడ్డపై జరగనున్నట్లు భారత హాకీ అధ్యక్షుడు దిలీప్ టర్కీ తెలిపారు. ఈ అవకాశమిచ్చిన FIH అధ్యక్షుడు డాటో టయ్యాబ్ ఇక్రమ్‌కు ధన్యవాదాలు తెలిపారు. భారత్ ఈ పోటీలకు ఆతిథ్యమివ్వడం ఇది నాలుగో సారి. అంతకుముందు 2013, 16, 21లో ఈ పోటీలు జరిగాయి. వచ్చే ఏడాది డిసెంబర్‌లో ఈ టోర్నీ జరగనుంది.

Similar News

News January 21, 2026

FLASH: పెరిగిన వెండి ధర

image

ఇవాళ ఉదయం నుంచి తటస్థంగా ఉన్న వెండి ధర మధ్యాహ్నం పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. కేజీ సిల్వర్ రేటు రూ.5వేలు పెరిగి రూ.3,45,000కు చేరింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతుండటంతో గోల్డ్, సిల్వర్ రేట్లు ఊహించని స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,61,100, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,48,474గా ఉంది.

News January 21, 2026

పండ్ల తోటల్లో కలుపు నివారణ మార్గాలు

image

పండ్ల తోటల తొలిదశలో అంతర పంటలతో కలుపు తగ్గించవచ్చు. పండ్ల కోత తర్వాత ముందుగా తోటంతా అడ్డంగా, నిలువుగా దున్నాలి. కలుపు మొక్కలు పెరిగితే రోటావేటర్ తోటలోకి వెళ్లడానికి వీలుగా ఏపుగా పెరిగిన కొమ్మలను తీసేసి ఒకసారి తోటంతా శుభ్రం చేస్తే నెలరోజులపాటు కలుపును నివారించవచ్చు. తోటను శుభ్రం చేసిన వెంటనే భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు 1-1.5 లీటర్ల పెండిమిథాలిన్‌ను 5 కిలోల ఇసుకలో కలిపి తోటంతా సమానంగా వెదజల్లాలి.

News January 21, 2026

APPLY NOW: సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడులో ఉద్యోగాలు

image

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు(<>CUTN<<>>)లో 13 నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ, M.LSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cutn.ac.in/