News August 5, 2025
రిసిప్టులను 10 సెకన్లకు మించి పట్టుకుంటున్నారా?

బిల్లు రిసిప్టులను 10 సెకన్లకు మించి చేతితో పట్టుకుంటే సంతాన సామర్థ్యం తగ్గుతుందని స్పెయిన్‌లోని గ్రెనడా యూనివర్సిటీ రీసెర్చ్‌లో వెల్లడైంది. బిస్ఫెనాల్ A(BPA) లేదా బిస్ఫెనాల్ S వంటి రసాయనాలతో చేసే థర్మల్ పేపర్‌పై బిల్స్ ముద్రిస్తారు. ఇవి చర్మం ద్వారా సులభంగా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకుని, వీర్య కణాల సంఖ్య&నాణ్యతను తగ్గిస్తాయని తేలింది.
Similar News
News August 6, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (ఆగస్టు 6, బుధవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.40 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.57 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.22 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.49 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.47 గంటలకు
✒ ఇష: రాత్రి 8.04 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News August 6, 2025
ఏపీలో ‘సంజీవని’ పేరుతో కొత్త అంబులెన్సులు

APలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన కొత్త తరహా అంబులెన్సులు త్వరలోనే రోడ్డెక్కనున్నాయి. ప్రస్తుతం ఉన్న నీలం రంగు బదులుగా తెలుపు, ఎరుపు, పసుపు రంగుల సమ్మేళనంతో, రిఫ్లెక్టివ్ టేపులతో కొత్త వాటిని తయారు చేస్తున్నారు. ఈ అంబులెన్సులకు సంజీవని అనే పేరు పెట్టారు. వీటి తయారీ పనులు కృష్ణా జిల్లాలోని కుశలవ్ కోచ్ ఫ్యాక్టరీలో జరుగుతున్నాయి. మొదటి విడతలో 104 ఎమర్జెన్సీ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి.
News August 6, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.