News March 14, 2025

HOLI: సెలబ్రేషన్స్ పేరుతో హద్దులు దాటకండి..

image

హోలీ వేడుకల్లో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం కామన్. అయితే ఇదే అదనుగా కొందరు తమలోని ఆకతాయితనాన్ని బయటకు తీస్తారు. ఇది పరిధిలో ఉంటే పర్లేదు కానీ హద్దు దాటితేనే సమస్య. ఎదుటి వారి ఇష్టంతోనే వారిపై రంగులు చల్లేందుకు ప్రయత్నించండి. పండగ పేరుతో ఇతరులను ఇష్టం వచ్చినట్లు తాకి, రంగులు పూసి ఇబ్బంది పెట్టకండి. ముఖ్యంగా తెలియని వారి విషయంలో హుందాగా వ్యవహరించండి.
HAPPY HOLI

Similar News

News November 16, 2025

200 కొట్టినా నాన్న సంతృప్తిచెందరు: వైభవ్

image

యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ సంచలన బ్యాటింగ్‌తో చెలరేగుతున్న విషయం తెలిసిందే. UAEపై వీర విహారం చేసి 32 బంతుల్లోనే <<18287840>>సెంచరీ<<>> నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తన తండ్రి గురించి వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను 200 కొట్టినా నాన్న సంతృప్తిచెందరు. ఇంకో 10 రన్స్ చేసి ఉండేవాడినని అంటారు. అమ్మ మాత్రం సెంచరీ చేసినా, డకౌట్ అయినా సంతోషంగానే ఉంటుంది. బాగా ఆడమని చెబుతుంది’ అని BCCI ఇంటర్వ్యూలో చెప్పారు.

News November 16, 2025

నవంబర్ 16: చరిత్రలో ఈరోజు

image

* 1966: జాతీయ పత్రికా దినోత్సవం * 1908: తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి జననం. * 1923: తెలుగు సినీ నటుడు కాంతారావు జననం.(ఫొటోలో) * 1963: భారతీయ సినీ నటి మీనాక్షి శేషాద్రి జననం. * 1973: తెలుగు, తమిళ సినీ నటి ఆమని జననం. * 1973: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ జననం. * 1983: మ్యూజిక్ డైరెక్టర్ తమన్ జననం (ఫొటోలో).

News November 16, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.