News October 27, 2025
ఈ జిల్లాల్లో కాలేజీలకు సెలవు

AP: తుఫాను నేపథ్యంలో స్కూళ్లతో పాటు పలు జిల్లాల్లోని జూనియర్ ఇంటర్ కాలేజీలకు అధికారులు సెలవులు ప్రకటించారు. అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కాలేజీలకు ఈ నెల 29 వరకు సెలవులు ఇచ్చారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, కడప జిల్లాల్లో రేపు హాలిడే ఉండనుంది. కాకినాడలో 31 వరకు సెలవులు ప్రకటించారు. మిగతా జిల్లాల్లో యథావిధిగా కాలేజీలు నడవనున్నాయి.
Similar News
News October 28, 2025
నేటి ముఖ్యాంశాలు

* తుఫాను.. పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3వేలు
* రేపు రాత్రి కాకినాడ సమీపంలో తీరం తాకనున్న ‘మొంథా’ తుఫాన్
* జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నాలుగు రోజులు ప్రచారం చేయనున్న సీఎం రేవంత్
* పత్తి తేమ 12% దాటితే మద్దతు ధర రాకపోవచ్చు: తుమ్మల
* రెండో దశలో 12 చోట్ల SIR నిర్వహణ: CEC
* కోలుకుంటున్న టీమ్‌ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్
News October 28, 2025
లోకేశ్ ఆధ్వర్యంలో డేటా సెంటర్ అడ్వైజరీ కౌన్సిల్

AP: డేటా సెంటర్ అడ్వైజరీ కౌన్సిల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2030 నాటికి 6వేల MW డేటా సామర్థ్యమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కౌన్సిల్‌ను మంత్రి నారా లోకేశ్ లీడ్ చేయనున్నారు. ఇందులో Microsoft Azure, Jio Platforms వంటి అంతర్జాతీయ కంపెనీలు, IIM విశాఖ, IIT తిరుపతి సంస్థల ప్రతినిధులకు స్థానం కల్పించారు. పెట్టుబడులు, అనుమతులు, నైపుణ్యాభివృద్ధి వంటి వాటిపై కౌన్సిల్ మార్గనిర్దేశం చేయనుంది.
News October 28, 2025
వైద్య చిహ్నం వెనుక అసలు కథ!

వైద్య రంగానికి వాడే చిహ్నం వెనుక ఉన్న చరిత్ర గురించి మీకు తెలుసా? ఈ చిహ్నాన్ని ‘రాడ్ ఆఫ్ అస్క్లెపియస్’ అంటారని చరిత్రకారులు చెబుతున్నారు. ఒక్క పాము చుట్టుకొని ఉన్న ఈ కర్ర గ్రీకు వైద్య దేవుడు అస్క్లెపియస్‌కు ప్రతీకగా భావిస్తారు. పాము చర్మం విడిచే విధానం పునర్జన్మ, ఆరోగ్యం & నయం కావడాన్ని సూచిస్తుందని తెలియజేస్తున్నారు. అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సింబల్ కూడా ఇదే ఉండటం విశేషం.


