News September 25, 2024

ట్రామ్‌లకు త్వరలోనే ‘సెలవు’

image

కోల్‌కతా మహానగరంలో 150 ఏళ్లుగా కొనసాగుతున్న ట్రామ్ సేవలు నిలిచిపోనున్నాయి. దేశంలో ప్రస్తుతం ఈ ఒక్క నగరంలో ట్రామ్ రవాణా సదుపాయం ఉండగా, త్వరలో నిలిపివేస్తామని మంత్రి స్నేహాశీష్ చక్రబర్తి తెలిపారు. నగరంలో పరిమిత వేగంతో ప్రయాణించే ట్రామ్‌ల వల్ల ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని, ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కోల్‌కతాలో 1873 నుంచి ట్రామ్‌లు సేవలందిస్తున్నాయి.

Similar News

News September 25, 2024

సూసైడ్ క్యాప్సుల్‌లో తొలి మరణం!

image

స్విట్జర్లాండ్‌లో ఓ మహిళ సూసైడ్ క్యాప్సుల్ ‘సార్కో పాడ్’ సాయంతో ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆమె ఆత్మహత్యకు సహకరించారన్న ఆరోపణలతో పలువురిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. జర్మనీ సరిహద్దు మేరీషాజన్ అటవీ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఈ ఆత్మహత్య జరిగింది. కాగా ఈ క్యాప్సుల్‌లోని బటన్ నొక్కగానే నైట్రోజన్ వాయువు విడుదలై అందులో పడుకున్న వ్యక్తి ఊపిరాడక నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోతారు.

News September 25, 2024

హర్షసాయి కోసం గాలింపు

image

TG: యూట్యూబర్ హర్షసాయి కోసం నార్సింగి పోలీసులు గాలిస్తున్నారు. యువతి ఫిర్యాదుతో అతడిపై అత్యాచారం కేసు నమోదైంది. విశాఖతో పాటు మరికొన్ని చోట్ల అతడి కోసం బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలిస్తున్నారు. హర్ష పరారీలో ఉన్నాడా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా 376(2), 376N, 354 సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదైంది.

News September 25, 2024

కాన్పూర్ టెస్ట్.. బుమ్రాకు రెస్ట్?

image

భారత్-బంగ్లాదేశ్ మధ్య ఈనెల 27 నుంచి జరగనున్న 2వ టెస్ట్‌లో స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. త్వరలో కివీస్, AUSతో సుదీర్ఘ టెస్ట్ సిరీస్‌లు ఆడాల్సి ఉండటం, కాన్పూర్ పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో అతడిని డ్రాప్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే IND అశ్విన్, జడేజాతో పాటు మరో స్పిన్నర్‌తో బరిలోకి దిగనుంది. ఆ స్థానం కోసం కుల్దీప్, అక్షర్ పోటీ పడుతున్నారు.