News June 3, 2024
ఈనెల 17 లేదా 18న తెలంగాణలో సెలవు!

బక్రీద్ పండుగ సందర్భంగా ఈనెల 17న తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నెలవంక దర్శనం ఆధారంగా ముస్లింలు బక్రీద్‌ను జరుపుకుంటారు. ఈనెల 7న నెలవంక కనిపిస్తే జూన్ 17న, లేకపోతే 18న జరుపుకోనున్నారు. పండుగ జరుపుకునే రోజున (17or18) సెలవు ఉండనుంది.
Similar News
News October 27, 2025
TODAY HEADLINES

* విశాఖకు 790km, కాకినాడకు 780km దూరంలో మొంథా తుఫాన్
* తుఫానుతో ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చర్యలు: CM CBN
* భారీ వర్షాలు.. APలో 20 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
* ఈనెల 30 నుంచి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో CM రేవంత్
* ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో మార్పులు: పొంగులేటి
* TGలో NOV 3 నుంచి ప్రైవేట్ కాలేజీల బంద్: ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య
News October 27, 2025
రేషన్ షాపుల్లో 20% అధిక నిల్వలు: మనోహర్

AP: తుఫాను నేపథ్యంలో MLS(మండల స్థాయి స్టాక్ కేంద్రాలు), రేషన్ షాపుల్లో 20% అధిక నిల్వలు ఉంచినట్లు మంత్రి మనోహర్ తెలిపారు. తీరప్రాంత జిల్లాల్లో 40% వరకు సరకు తరలింపు పూర్తయిందన్నారు. మరోవైపు ధాన్యం కొనుగోలులో రైతులను మిల్లర్లు ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు. 50 వేల టార్పాలిన్లు, ఇతర సామగ్రిని అందుబాటులో ఉంచామని చెప్పారు. ధాన్యం సేకరణ కేంద్రాల్లోని టార్పాలిన్లను రైతులు వాడుకోవచ్చని స్పష్టం చేశారు.
News October 27, 2025
బస్సు ప్రమాదం.. ప్రయాణికులకు RTC గమనిక

కర్నూలులో ట్రావెల్స్ బస్సు ప్రమాదం నేపథ్యంలో TGSRTC ప్రకటన జారీ చేసింది. ‘ప్రయాణికుల క్షేమమే ధ్యేయంగా లహరి, రాజధాని వంటి AC బస్సుల్లో వెనుక అత్యవసర ద్వారం, కిటికీ అద్దాలు పగులగొట్టేందుకు సుత్తెలు, మంటలు ఆర్పే పరికరాలు, డీలక్స్, ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో కుడి వైపు, వెనుక భాగంలో అత్యవసర ద్వారం, అగ్నిమాపక యంత్రం అందుబాటులో ఉంటాయి. RTC బస్సుల్లో ప్రయాణం సురక్షితం’ అని ట్వీట్ చేసింది.


