News March 8, 2025
ఇవాళ స్కూళ్లకు సెలవు

AP: రాష్ట్రంలోని ప్రకాశం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇవాళ సెలవు ఇస్తున్నట్లు ఆయా జిల్లాల DEOలు ప్రకటించారు. కాగా ఇటీవల వరదల కారణంగా ఆయా జిల్లాల్లోని పాఠశాలలకు వరుసగా సెలవులు ఇచ్చారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఇవాళ తరగతులు నిర్వహిస్తామని గతంలో ప్రకటించారు. కానీ మహిళా దినోత్సవం నేపథ్యంలో వర్కింగ్ డేను రద్దు చేసి సెలవు ఇచ్చారు. ప్రత్యామ్నాయంగా మరో రోజు క్లాసులు నిర్వహిస్తారు.
Similar News
News January 25, 2026
థాంక్యూ ఇండియా: ఇరాన్

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC)లో తమకు అండగా నిలిచినందుకు ఇండియాకు ఇరాన్ థాంక్స్ చెప్పింది. ‘మాకు మద్దతు ఇచ్చినందుకు ఇండియాకు కృతజ్ఞతలు. న్యాయం, జాతీయ సార్వభౌమత్వం విషయంలో ఆ దేశ వైఖరికి ఇది నిదర్శనం’ అని ఇరాన్ రాయబారి మహ్మద్ ఫథాలీ అన్నారు. కాగా శాంతియుత నిరసనలను ఇరాన్ ప్రభుత్వం అణచేస్తోందంటూ UNHRC 39వ ప్రత్యేక సెషన్‌లో ప్రవేశపెట్టిన తీర్మానానికి వ్యతిరేకంగా భారత్ ఓటు వేసింది.
News January 25, 2026
వేరుశనగలో ఇనుపధాతులోపం.. నివారణ

ఆకులలో పత్రహరితం తయారవడానికి ఇనుపధాతువు కీలకం. ఇది లోపించినప్పుడు వేరుశనగ మొక్క ఆకులు పసుపు రంగుకు మారతాయి. క్రమంగా ఆకు కొనలు ఎండిపోతాయి. మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. ఈ సమస్య నివారణకు 0.5 శాతంఅన్నబేధి(5గ్రా. లీటరు నీటికి), 0.1 శాతం నిమ్మఉప్పు(లీటరు నీటికి 1గ్రాము) కలిపిన ద్రావణాన్ని 4-5 రోజుల వ్యవధిలో 2-3సార్లు పిచికారీ చేసుకోవాలి.
News January 25, 2026
కెనడాపై 100% టారిఫ్స్ విధిస్తా: ట్రంప్

చైనాతో ట్రేడ్ డీల్‌పై ముందుకు వెళ్తే కెనడాపై చర్యలు తప్పవని US అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ‘ఆ దేశాన్ని సజీవంగా చైనా మింగేస్తుంది. వారి వ్యాపారాలు, సామాజిక నిర్మాణం, జీవన విధానాన్ని నాశనం చేస్తుంది. చైనా ఉత్పత్తులను అమెరికాకు పంపేందుకు కెనడాను డ్రాప్ ఆఫ్ పోర్టుగా ఉపయోగించాలనుకుంటే వాళ్లు పొరపాటు పడినట్లే. డీల్ చేసుకున్న మరుక్షణమే కెనడాపై 100% టారిఫ్స్ విధిస్తాం’ అని వార్నింగ్ ఇచ్చారు.


