News February 22, 2025
ఆ రోజున సెలవు

TG: MLC ఎన్నికల నేపథ్యంలో FEB 27న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సెలవు ప్రకటించింది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ టీచర్స్ MLC, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ టీచర్స్, ఇదే స్థానానికి గ్రాడ్యుయేట్ ఎన్నిక ఆరోజున జరగనుంది. దీంతో ఈ నియోజకవర్గాల పరిధిలోని టీచర్లకు ప్రభుత్వం ప్రత్యేక సెలవు ఇచ్చింది. అటు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే గ్రాడ్యుయేట్లు ఓటింగ్‌లో పాల్గొనేలా కంపెనీలు సహకరించాలని ఈసీ కోరింది.
Similar News
News February 22, 2025
CM రేవంత్ సవాల్‌ను స్వీకరిస్తున్నా: కిషన్ రెడ్డి

TG: రాష్ట్రంలో జరగనున్న MLC ఎన్నికల్లో పసుపు బోర్డు ప్రభావం ఉంటుందని, 3 స్థానాలూ గెలుస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హామీల అమలుపై CM రేవంత్ చేసిన సవాలును స్వీకరిస్తున్నట్లు చెప్పారు. చర్చల కోసం ఎక్కడికి రావాలో చెప్పాలని కోరారు. హమీల అమలుకు ప్రభుత్వం వద్ద కనీసం కార్యాచరణ లేదని విమర్శించారు. కులగణనకు BJP వ్యతిరేకం కాదని, ముస్లింలను బీసీల్లో చేర్చడాన్ని ఖండిస్తున్నామన్నారు.
News February 22, 2025
IndvsPak: చూస్తే.. వ్యూయర్‌షిప్ రికార్డులు బద్దలే!

CT25లో భారత్, పాక్ మ్యాచ్‌తో వ్యూయర్‌షిప్ రికార్డులు బద్దలవ్వొచ్చు. ICC టోర్నీల్లో దాయాదులు తలపడ్డ ప్రతిసారీ ఇలాగే జరుగుతోంది. WC23లో 2 జట్ల పోరుకు డిస్నీ స్టార్ నెట్‌వర్క్, DDకి కలిపి 17.3CR, డిస్నీ హాట్‌స్టార్‌కు 22.5CR TV, డిజిటల్ వ్యూయర్‌షిప్ లభించింది. పీక్ స్టేజ్‌లో ఒకేసారి టీవీల్లో 7.6CR, డిజిటల్‌లో 3.5CR మంది వీక్షించారు. రేపు ఈ రికార్డులు బ్రేకవ్వడం ఖాయమేనని అంచనా. మరి మీరేమంటారు?
News February 22, 2025
ఏపీపీఎస్సీపై అభ్యర్థుల తీవ్ర అసంతృప్తి

AP: గ్రూప్-2 మెయిన్స్ వాయిదా వేయాలని కోరుతూ <<15544005>>ప్రభుత్వం రాసిన లేఖపై<<>> ఏపీపీఎస్సీ ఇంకా స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం నిన్ననే లేఖ రాసినా ఏపీపీఎస్సీ పెద్దలు ఇంకా స్పందించకపోవడంపై అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం రేపే పరీక్ష ఉండటంతో అసలు జరుగుతుందా? లేదా? అని అయోమయానికి గురవుతున్నారు.