News April 12, 2025
విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులకు సెలవులు రద్దు

AP: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపునకు నిరసనగా కార్మిక సంఘాలు ఈ నెల 16 నుంచి సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో యాజమాన్యం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా ఈ నెల 15 నుంచి 30 వరకు ఉద్యోగులు, సిబ్బందికి సెలవులను రద్దు చేసింది. అందరూ విధులకు హాజరవ్వాలని ఆదేశించింది.
Similar News
News November 26, 2025
సర్పంచ్ ఎన్నికలు.. హైకోర్టులో పిటిషన్లు

తెలంగాణ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై పలు గ్రామాల ప్రజలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించలేదని అందులో పేర్కొన్నారు. వరంగల్, సంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లోని గ్రామాల్లో సర్పంచ్, వార్డు రిజర్వేషన్లను సవాల్ చేశారు. దీనిపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
News November 26, 2025
గ్లోబల్ సమ్మిట్‌కు PMను ఆహ్వానించాలి: సీఎం

TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ప్రారంభోత్సవానికి PM మోదీ, కేంద్ర మంత్రులను ఆహ్వానించాలని CM రేవంత్ రెడ్డి సూచించారు. పెట్టుబడులపై ఒప్పందాల విషయంలో ప్లాన్ ప్రకారం ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. వివిధ విభాగాలపై స్టాల్స్, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచేలా డ్రోన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సమీక్షలో పేర్కొన్నారు. 2,600 మందికి ఆహ్వానం అందించామని CMకు అధికారులు తెలియజేశారు.