News April 3, 2024

స్కూళ్లకు సెలవులు.. మరో కీలక ఆదేశం

image

AP: ఈ నెల 24 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించిన విద్యాశాఖ.. ఫైనల్ పరీక్షలపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వార్షిక పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. రెండు రోజుల్లో మూల్యాంకనం పూర్తి చేసి ఏప్రిల్ 23న ఫలితాలను ప్రకటించి విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందించాలని ఆదేశాల్లో పేర్కొంది. జూన్ 11 వరకు సెలవులు ఉంటాయి.

Similar News

News October 24, 2025

ఇజ్రాయెల్‌ను పరోక్షంగా హెచ్చరించిన ట్రంప్

image

పాలస్తీనాలో భాగమైన వెస్ట్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకుంటే ఇజ్రాయెల్ తమ మద్దతును పూర్తిగా కోల్పోతుందని US అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. వెస్ట్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకోదనే విషయమై తాను అరబ్ దేశాలకు మాట ఇచ్చానని పేర్కొన్నారు. అటు వెస్ట్ బ్యాంక్ స్వాధీనానికి అంగీకారం తెలిపేలా బిల్లులను ఇజ్రాయెల్ పార్లమెంట్ తీసుకొచ్చింది. కాగా ఈ వెస్ట్ బ్యాంక్‌‌ను యూదుల చారిత్రాక కేంద్రంగా ఇజ్రాయెల్ భావిస్తోంది.

News October 24, 2025

అక్టోబర్ 24: చరిత్రలో ఈరోజు

image

1930: నిర్మాత చవ్వా చంద్రశేఖర్ రెడ్డి జననం
1966: నటి నదియా జననం
1980: నటి లైలా జననం
1985: బాల్ పాయింట్ పెన్ ఆవిష్కర్త లాస్లో బైరో మరణం
2015: హాస్య నటుడు మాడా వెంకటేశ్వరరావు మరణం
2017: దక్షిణ భారత సినిమా దర్శకుడు ఐ.వి.శశి మరణం
✿ఐక్యరాజ్య సమితి దినోత్సవం
✿ప్రపంచ పోలియో దినోత్సవం

News October 24, 2025

WWC 2025: సెమీస్ చేరిన జట్లివే..

image

మహిళల వన్డే వరల్డ్ కప్(WWC) 2025లో సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. NZతో మ్యాచులో విజయంతో టీమ్‌ఇండియా సెమీస్ చేరింది. అంతకుముందు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా సెమీస్ చేరుకున్న సంగతి తెలిసిందే. సెమీఫైనల్‌కు ముందు ఈ జట్లు తలో మ్యాచ్ ఆడనున్నాయి. ఈ నెల 26న బంగ్లాతో మ్యాచులో భారత్ గెలిచినా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలోనే ఉండనుంది. అటు మిగతా 3 జట్ల ప్రదర్శన టాప్-3 స్థానాలను ఖరారు చేయనుంది.