News September 22, 2025
నేటి నుంచి సెలవులు

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల ప్రకటన ప్రకారం ఇవాళ్టి నుంచి దసరా సెలవులు అమల్లోకి వచ్చాయి. APలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు, TGలో అక్టోబర్ 3 వరకు హాలిడేస్ ఉండనున్నాయి. అయితే విద్యార్థులకు నిన్న ఆదివారం కలిసి రావడంతో ఇప్పటికే హాలిడేస్ ఎంజాయ్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. ఇక స్కూల్స్ రీఓపెన్ అయ్యే OCT 3, 4న శుక్ర, శనివారాలు కావడంతో స్టూడెంట్స్ ఆదివారం మరుసటి రోజు సోమవారం(6న) బడిబాట పట్టే అవకాశముంది.
Similar News
News January 13, 2026
తెలంగాణ హాకీ జట్టు కెప్టెన్‌గా నల్గొండ బిడ్డ ఎంపిక

రాజస్థాన్ ఉదయపూర్‌లో జరుగుతున్న జాతీయ హాకీ పోటీల్లో నల్గొండకు చెందిన కుంచం రాకేశ్ తెలంగాణ హాకీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడని ఉమ్మడి జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇమాం కరీం తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి SGF U/19 హాకీ పోటీలో అద్భుత ప్రతిభ కనబరిచి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడన్నారు. కెప్టెన్‌గా ఎంపికవడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.
News January 13, 2026
సంక్రాంతి విషెస్ చెప్పిన సీఎం రేవంత్

TG: తెలుగు ప్రజలకు CM రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘భోగ భాగ్యాలను అందించే భోగి.. కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి.. కనుమ పండుగలను అంతా ఆనందంగా జరుపుకోవాలి. పతంగులు ఎగరవేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ ప్రతి కుటుంబానికి చేరాలనేది మా సంకల్పం. తెలంగాణ రైజింగ్-2047 విజన్ సాకారం చేసేందుకు మేము కట్టుబడి ఉన్నాం’ అని అన్నారు.
News January 13, 2026
రూపాయి క్షీణత.. హెచ్చుతగ్గుల్లో భాగమే: RBI గవర్నర్

ఇటీవల రూపాయి <<18834841>>విలువ<<>> పడిపోతుండటం తెలిసిందే. డాలర్‌తో పోలిస్తే రూపీ వాల్యూ రూ.90ని దాటింది. అయితే ఇది సాధారణ హెచ్చుతగ్గుల్లో భాగమేనని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. ‘రూపాయి, మారకపు రేట్లపై RBI విధానం ఏళ్లుగా స్థిరంగా ఉంది. మార్కెట్లు బలంగా ఉన్నాయని మేం నమ్ముతున్నాం. ధరలను అవే నిర్ణయిస్తాయి’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. భారత ఎకానమీ మూలాలు బలంగా ఉన్నాయని తెలిపారు.


