News April 13, 2025

హాలీవుడ్ యాక్టర్ నిక్కీ కేట్ కన్నుమూత

image

ప్రముఖ హాలీవుడ్ నటుడు నిక్కీ కేట్(54) కన్నుమూశారు. అతని మరణానికి గల కారణాలు వెల్లడి కాలేదు. 1980లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నిక్కీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. డేజ్డ్ అండ్ కన్ఫ్యూజ్డ్, అమెరికన్ యకుజా, ఫాంటమ్స్, ఇన్సోమేనియా, ది బేబీ సిట్టర్ తదితర 40 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. అలాగే దాదాపు 30 టీవీ సిరీస్‌లలోనూ నటించారు. హాలీవుడ్‌లో కల్ట్ యాక్టర్‌గా గుర్తింపు పొందారు.

Similar News

News December 10, 2025

శ్రీ సత్యసాయి, అనంతలో ‘స్క్రబ్ టైఫస్’ కలకలం

image

కలకలం సృష్టిస్తున్న స్క్రబ్ టైఫస్ అనంత జిల్లాకూ పాకింది. రాయదుర్గం సమీపంలోని తాళ్లకెరకు చెందిన బాలిక జ్వరంతో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి రాగా రక్తపరీక్షలు నిర్వహించారు. శ్రీ సత్యసాయి(D) ముదిగుబ్బ మండలానికి చెందిన గర్భిణి ప్రసవం నిమిత్తం చేరారు. జ్వరం ఉండటంతో ఆమెకూ పరీక్షలు చేశారు. ఇద్దరికీ పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్లు నిర్ధారించారు. 2 రోజుల క్రితం హిందూపురంలో ఓ మహిళకు స్క్రబ్ టైఫస్ సోకింది.

News December 10, 2025

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీలో ఉద్యోగాలు

image

<>నేషనల్ <<>>ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీలో 7 ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 4 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా లేదా బీఎస్సీ లేదా ఇంజినీరింగ్ ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nise.res.in/.

News December 10, 2025

నానో ఎరువులను ఎలా వాడాలి?

image

నానో యూరియా, DAPలను పైరుపై పిచికారీ పద్ధతిలోనే వాడాలి. వీటిని భూమిలో, డ్రిప్‌‌లలో వాడకూడదు. పంటలకు దుక్కిలో వ్యవసాయ నిపుణులు సిఫార్సు చేసిన ఎరువులను యథావిధిగా వేయాలి. పంటకు పైన ఎరువులను సిఫార్సు చేసినప్పుడు మాత్రం.. నానో ఎరువుల రూపంలో పిచికారీ చేసుకోవాలి. నానో యూరియా, DAPలను ఎకరాకు అర లీటరు(లీటరు నీటికి 4ml)చొప్పున పిచికారీ చేయాలి. తర్వాత సంప్రదాయ యూరియా, DAPలను పంటకు వేయనవసరం లేదు.