News February 28, 2025
అంతరిక్షంలోకి హాలీవుడ్ సింగర్

హాలీవుడ్ సింగర్ కేటి పెర్రీ స్పేస్‌లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు చెందిన ‘బ్లూ ఆరిజిన్’ సంస్థ ఈ ఏడాది న్యూ షెపర్డ్ స్పేస్‌క్రాఫ్ట్‌ను అంతరిక్షంలోకి పంపనుంది. అందులో ఆరుగురు సభ్యులు గల మహిళా బృందం వెళ్లనుంది. పెర్రీతో పాటు బెజోస్ ఫియాన్సీ సాంచెజ్, నటి గెయిల్ కింగ్, సామాజిక కార్యకర్త అమండా, నిర్మాత కరియన్నె ఫ్లిన్, నాసా మాజీ రాకెట్ సైంటిస్ట్ ఐషా బొవే వెళ్లనున్నారు.
Similar News
News February 28, 2025
కాజల్, తమన్నాను విచారించనున్న పోలీసులు

క్రిప్టో కరెన్సీ మోసం కేసులో హీరోయిన్లు కాజల్ అగర్వాల్, తమన్నాను విచారించేందుకు పుదుచ్చేరి పోలీసులు సిద్ధమయ్యారు. ఈ కేసులో ఇప్పటికే నితీశ్ జైన్, అరవింద్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. క్రిప్టో కరెన్సీలో అధిక లాభం వస్తుందని ఆశ చూపి రూ.2.40 కోట్లు మోసం చేసినట్లు పుదుచ్చేరికి చెందిన అశోకన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కంపెనీకి ప్రచారం చేసిన తమన్నా, కాజల్‌ను పోలీసులు విచారించనున్నారు.
News February 28, 2025
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్

AP: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. రానున్న వేసవిలో భక్తుల సౌకర్యార్థం చలువ పెయింటింగ్ వేయాలని టీటీడీ నిర్ణయించింది. భక్తులకు ఎండ, వేడి నుంచి ఉపశమనం కలిగించేందుకే ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. అలాగే నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. లడ్డూల బఫర్ స్టాక్, తాగు నీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు తగినన్ని అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించింది.
News February 28, 2025
కంగారూలపై ప్రతీకారం తీర్చుకుంటారా?

2023 వన్డే WCలో అఫ్గానిస్థాన్ ఆస్ట్రేలియాను ముప్పుతిప్పలు పెట్టింది. మ్యాక్స్‌వెల్ వీరోచిత పోరాటంతో కంగారూలు ఓటమి నుంచి తప్పించుకోగలిగారు. ఇప్పుడు ఆ రెండు జట్లు నేడు CTలో మరోసారి తలపడనున్నాయి. ఇప్పటికే ENGను ఓడించి జోరు మీద ఉన్న అఫ్గాన్.. ఆస్ట్రేలియన్లకు షాక్ ఇచ్చి ప్రతీకారం తీర్చుకుంటుందేమో చూడాలి. స్టార్క్, కమిన్స్, హేజిల్‌వుడ్ లాంటి సీనియర్ బౌలర్లు లేకపోయినా AUSను తక్కువ అంచనా వేయలేం.