News January 12, 2025
మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత

AP: హోంమంత్రి అనిత మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు సహాయం చేశారు. విశాఖపట్నంలోని పాత గాజువాక జంక్షన్‌లో అనిత కారులో వెళ్తున్నారు. అదే సమయంలో ఓ బైక్‌ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి గాయపడింది. వెంటనే ఆమె తన సిబ్బందిని ఆదేశించి ఆస్పత్రికి పంపించారు. ఇది చూసిన స్థానికులు మంత్రిని అభినందిస్తున్నారు.
Similar News
News April 3, 2026
ముగిసిన టెన్త్ పరీక్షలు.. 6 నుంచి వాల్యుయేషన్

AP: మార్చి 16వ తేదీన మొదలైన టెన్త్ పరీక్షలు నిన్నటితో ముగిశాయి. అన్ని ప్రధాన సబ్జెక్టుల్లో 99.05% అటెండెన్స్ నమోదైంది. 3,415 ఎగ్జామ్ సెంటర్లలో 6,22,152 మంది రెగ్యులర్.. 19,568 మంది ప్రైవేట్ అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పేపర్ల వాల్యుయేషన్ జరగనుంది. ఈ నెల నాలుగో వారంలో రిజల్ట్స్ వచ్చే అవకాశముంది.
News April 3, 2026
చెపాక్‌లో చెన్నై బోణీ కొడుతుందా?

IPL: తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం ఎదుర్కొన్న CSK ఈరోజు తన రెండో మ్యాచ్ PBKSతో ఆడనుంది. సొంతగడ్డ అయిన చెపాక్ స్టేడియంలో పంజాబ్‌ను ఓడించి బోణీ కొట్టాలని సీఎస్‌కే ఆశిస్తోంది. మరోవైపు GTపై విక్టరీతో ఉత్సాహంగా ఉన్న పంజాబ్ ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాలని అనుకుంటోంది. ఇరు జట్లు ఇప్పటివరకు 32సార్లు తలపడగా చెరో 16 విజయాలతో సమానంగా ఉన్నాయి. ఈరోజు రాత్రి 7.30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది.
News April 3, 2026
ఎలాంటి వారికి దూరంగా ఉండాలి?

వేరుపురుగు చేరి వృక్షంబు జెఱచును
చీడపురుగు చేరి చెట్టు చెఱచు
కుత్సితుండు చేరి గుణవంతు చెఱచురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఓ మహా వృక్షాన్ని వేరు పురుగు నాశనం చేయగలదు. ఓ చెట్టును చీడ పురుగు చంపేయగలదు. అలాగే దుర్మార్గుడు కూడా మంచివారిని చెడగొట్టే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండాలి.
<<-se>>#PADHYAM<<>>


