News June 19, 2024

ఛార్జ్ తీసుకున్న హోం మినిస్టర్ అనిత

image

AP: రాష్ట్ర హోం మంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు స్వీకరించారు. తొలుత సచివాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్‌లో వేద పండితులతో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆమె బాధ్యతలు చేపట్టారు. పోలీసులు, ఉన్నతాధికారులు ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా పాయకరావుపేట నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కంబాల జోగులుపై అనిత 43వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో నెగ్గారు.

Similar News

News April 1, 2026

‘మీ సేవ’ ఛార్జీల పెంపు

image

TG: ‘మీ సేవ’ కేంద్రాల ద్వారా అందించే వివిధ ధ్రువపత్రాలు, ఇతర సేవలకు ప్రభుత్వం ఛార్జీలు పెంచింది. నేటి నుంచే అవి అమల్లోకి వచ్చాయి. ఇప్పటివరకు రూ.35గా ఉన్న కనీస ఛార్జీని రూ.62కి పెంచింది. A కేటగిరీ సేవలకు రూ.62 చొప్పున, B కేటగిరీ సర్వీసులకు రూ.80 చొప్పున రుసుమును నిర్ణయించింది. B- కేటగిరీలో కమ్యూనిటీ, ఇన్‌కమ్, రెసిడెన్స్, రేషన్ కార్డు, OBC, EWS సర్టిఫికెట్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తదితర సేవలున్నాయి.

News April 1, 2026

ఇరాన్‌ యుద్ధం.. అమెరికాతో విభేదించిన బ్రిటన్

image

ఇరాన్ యుద్ధం విషయంలో <<19525908>>అమెరికా<<>>తో బ్రిటన్ విభేదించింది. ఈ ఘర్షణల్లోకి ప్రవేశించేది లేదని PM స్టార్మర్ తేల్చి చెప్పారు. యుద్ధంతో సంబంధం లేనప్పటికీ.. తమ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఘర్షణల్ని ఆపేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నామన్నారు. హార్ముజ్ పున:ప్రారంభానికి ఉన్న మార్గాల్ని అన్వేషించేందుకు గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తామని తెలిపారు.

News April 1, 2026

7.30 గంటల నిడివితో ధురంధర్!

image

కంటెంట్, అధిక రన్ టైమ్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేసిన ‘ధురంధర్’ మేకర్స్ మరో సంచలనానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. రెండు పార్టులు కలిపి 7 గంటల 30 నిమిషాల నిడివితో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన CBFC సర్టిఫికెట్ SMలో వైరలవుతోంది. OTTలో విడుదల చేస్తారా? థియేటర్లలో స్పెషల్ షోలు వేస్తారా? అనేది క్లారిటీ లేదు. గతేడాది ‘బాహుబలి: ది ఎపిక్’ 3 గంటల 44 నిమిషాలతో రిలీజైన విషయం తెలిసిందే.