News July 28, 2024
హోంమంత్రి రాజీనామా చేయాలి: విజయసాయి

AP: రాష్ట్ర హోంమంత్రి మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదని YCP MP విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘బొల్లి మాటలతో కాలక్షేపం చేయడం వల్లనే రాష్ట్రం భయం గుప్పిట్లోకి వెళ్లిపోయింది. బయటకు వస్తే ఏమవుతుందో తెలియని దారుణ స్థితి ఉంది. దీనికి బాధ్యత వహించి హోంమంత్రి రాజీనామా చేయాలి. హత్యలు జరగకుండా చూడడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వ వైఫల్యంపై గవర్నర్ విచారణకు ఆదేశించాలి’ అని డిమాండ్ చేశారు.
Similar News
News November 17, 2025
హిందువులపై దాడులు బాధాకరం: షేక్ హసీనా

బంగ్లాదేశ్‌లో యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మైనార్టీలు, ముఖ్యంగా హిందువులపై దాడులను ప్రోత్సహిస్తోందని మాజీ PM షేక్ హసీనా మండిపడ్డారు. దీంతో వారంతా పారిపోవాల్సి వస్తోందన్నారు. దేశంలో హింస పెరిగిపోయిందని, ప్రజాస్వామ్యం, లౌకిక నిర్మాణం క్షీణిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యువత ఆందోళనలతో హసీనా గతేడాది ఆగస్టు 5 నుంచి భారత్‌లో ఆశ్రయం పొందుతోన్న విషయం తెలిసిందే.
News November 17, 2025
MANITలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

మౌలానా అజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(MANIT)లో 15 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని ఈ నెల 27వరకు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి. ME, M.Tech, M.Arch, మాస్టర్ ఆఫ్ డిజైన్‌తో పాటు సంబంధిత విభాగంలో PhD పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1500. వెబ్‌సైట్: https://www.manit.ac.in
News November 17, 2025
రవితేజ సినిమాలో సమంత?

రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో సమంత హీరోయిన్‌గా నటించే ఛాన్సుందని తెలిపాయి. గతంలో శివ దర్శకత్వంలో మజిలీ, ఖుషి సినిమాల్లో సామ్ నటించారు. దీంతో మరోసారి ఆమెను దర్శకుడు సంప్రదించినట్లు సమాచారం. దీనిపై మూవీ టీమ్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీతో, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో బిజీగా ఉన్నారు.


