News January 25, 2025

26 నుంచి హోంమంత్రి దుబాయ్ పర్యటన

image

AP: రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఈ నెల 26 నుంచి 31 వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. దుబాయ్, అబుదాబీలో వ్యక్తిగతంగా పర్యటించడానికి ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరగా, ఆ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పర్యటనను ఆమె సొంత నిధులతో చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Similar News

News January 20, 2026

ఆసిన్ వెడ్డింగ్ యానివర్సరీ.. భర్త క్రేజీ విషెస్!

image

హీరోయిన్ ఆసిన్, మైక్రోమ్యాక్స్ కోఫౌండర్ రాహుల్ శర్మ తమ పదో వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆసిన్‌తో ఉన్న వెడ్డింగ్ పిక్ షేర్ చేస్తూ ‘ఆసిన్ నా జీవితంలో ప్రతి ముఖ్యమైన విషయంలో కో-ఫౌండర్. ఆమె లైఫ్‌లో నేను కో-స్టార్‌గా ఉండటం నా అదృష్టం’ అని రాహుల్ అన్నారు. ‘మన ఇంటిని, నా మనసుని హై-గ్రోత్ స్టార్టప్‌లా నడిపించు’ అంటూ ఆసిన్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.

News January 20, 2026

వంటింటి చిట్కాలు

image

* అల్లం, వెల్లుల్లి పేస్ట్ చేసే ముందు వాటిని వేయిస్తే పేస్ట్ ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
* తేనెలో నాలుగైదు మిరియాలు వేస్తే చీమలు పట్టకుండా ఉంటాయి.
* చికెన్ ఉడికించేటప్పుడు ఒక కోడి గుడ్డు చేర్చడం వల్ల రుచి పెరుగుతుంది.
* కూర అడుగంటి మాడు వాసన వస్తే వాటిలో నిమ్మ, వెనిగర్, టమాటో రసం, వెన్న, పెరుగు కలిపితే వాసన పోయి, రుచి వస్తుంది.

News January 20, 2026

తమిళనాడు గవర్నర్ ‘హ్యాట్రిక్’ వాకౌట్!

image

తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ వర్సెస్ సర్కార్ వార్ మరోసారి బయటపడింది. ఈ ఏడాది తొలి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ RN రవి సభ నుంచి వాకౌట్ చేశారు. తమిళ గీతం తర్వాత జాతీయ గీతాన్ని కూడా ప్లే చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనికి స్పీకర్ అప్పావు నిరాకరించడంతో గవర్నర్ తన ప్రసంగాన్ని చదవకుండానే బయటకు వెళ్లిపోయారు. ఇలా జరగడం ఇది వరుసగా మూడోసారి. 2024, 2025లో కూడా ఆయన ఇదే కారణంతో సభను బహిష్కరించారు.