News October 22, 2025
పోషకాల నిలయం.. BPT-2858 ఎర్ర వరి రకం

అత్యంత పోషక విలువలు గల BPT-2858 ఎర్ర బియ్యం రకాన్ని బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం అభివృద్ధి చేసింది. ఇది త్వరలో మార్కెట్‌లోకి రానుంది. దీని పంట కాలం 135 రోజులు. దిగుబడి హెక్టారుకు ఆరు టన్నులు. మధుమేహం, గుండెజబ్బులు, క్యాన్సర్ రాకుండా రోగ నిరోధక శక్తి వృద్ధి చేయడంలో ఈ రకం కీలకపాత్ర పోషిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు.
* రోజూ అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
Similar News
News October 22, 2025
టీచర్లకూ టెట్.. త్వరలో నోటిఫికేషన్!

AP: టీచర్లకూ టెట్ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు జాబ్‌లో కొనసాగాలంటే టెట్ పాస్ కావాల్సిందేనని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. నిరుద్యోగులు, టీచర్లకు కలిపి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉన్నవారు రెండేళ్లలో టెట్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.
News October 22, 2025
ఏడడుగులు ఎందుకంటే?

మొదటి అడుగు – శారీరక బలం కోసం
రెండో అడుగు – మానసిక బలం కోసం
మూడో అడుగు – ధర్మాచరణ కోసం
నాల్గో అడుగు – కర్మ సంబంధమైన సుఖం కోసం
ఐదో అడుగు – పశు సమృద్ధి కోసం
ఆరో అడుగు – రుతువులలో తగిన ఆరోగ్యం కోసం
ఏడో అడుగు – సంసార జీవితాన్ని ‘ఒక యజ్ఞంగా’ భావించమని చెప్పే ‘స్నేహం’ కోసం
<<-se>>#Pendli<<>>
News October 22, 2025
రేపే మ్యాచ్.. 17 ఏళ్ల రికార్డ్ కాపాడుకుంటారా?

IND, AUS మధ్య రెండో వన్డే రేపు అడిలైడ్ ఓవల్ గ్రౌండ్‌లో జరగనుంది. తొలి మ్యాచ్‌లో ఓడిన టీమ్‌ఇండియా సెకండ్ ODIలో గెలిచి సిరీస్‌పై ఆశలు నిలుపుకోవాలని చూస్తోంది. కాగా అడిలైడ్‌లో 15 వన్డేలు ఆడిన IND 9 మ్యాచ్‌లు గెలిచింది. ఇక్కడ గత 17 ఏళ్లలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. స్టార్ ప్లేయర్లు కోహ్లీ, రోహిత్ రాణిస్తే రేపు భారత్‌కు తిరుగుండదు. మరి ఈ రికార్డును కాపాడుకుంటుందా? లేదా AUS బ్రేక్ చేస్తుందా? COMMENT