News December 22, 2024
HYDలో భారీగా తగ్గనున్న ఇళ్ల అమ్మకాలు

HYDలో Oct-Dec క్వార్టర్లో ఇళ్ల అమ్మకాలు 47% తగ్గే అవకాశం ఉందని PropEquity అంచనా వేసింది. గత ఏడాది Q3తో పోలిస్తే అమ్మకాలు 24,004 నుంచి 12,682 యూనిట్లకు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే దేశంలోని 9 మహా నగరాల్లో అమ్మకాలు 21% తగ్గొచ్చని సంస్థ వెల్లడించింది. బెంగళూరులో, చెన్నైలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. High Base Effect ఇళ్ల అమ్మకాల్లో క్షీణతకు కారణంగా తెలుస్తోంది.
Similar News
News November 15, 2025
జీఎస్టీ సంస్కరణలతో బీమా రంగం వృద్ధి: IRDAI

GST సంస్కరణలు అమలులోకి వచ్చిన తర్వాత బీమా రంగంలో వృద్ధి కనిపిస్తోందని IRDAI మెంబర్ దీపక్ సూద్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ బీమాను నిత్యవసర వస్తువుగా చూస్తోందన్నారు. బీమా పాలసీలపై జీఎస్టీని జీరో శాతానికి తీసుకురావడం ఇన్సూరెన్స్ రంగానికి కలిసొచ్చిందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా వస్తున్న నష్టాల నుంచి బయటపడేందుకు ప్రత్యేక పాలసీలు రూపొందించాలని, జీఎస్టీ ప్రయోజనాలు ప్రజలకు అందించాలని సూచించారు.
News November 15, 2025
స్త్రీలు గాజులు ఎందుకు ధరించాలి?

స్త్రీలు గాజులు ధరించడం సాంప్రదాయమే కాదు. శాస్త్రీయంగా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గాజులు మణికట్టుపై నిరంతరం రాపిడి కలిగిస్తాయి. దీంతో ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ స్థాయి పెరుగుతుంది. గాజుల గుండ్రటి ఆకారం శక్తిని శరీరం నుంచి వెళ్లకుండా అడ్డుకుని, తిరిగి మనకే పంపుతుంది. ముఖ్యంగా స్త్రీలకు మణికట్టు వద్ద శక్తిని నిలిపి ఉంచడానికి గాజులు రక్షా కవచంగా పనిచేస్తాయి. ఇది శారీరక సమతుల్యతను కాపాడుతుంది.
News November 15, 2025
iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

iBomma నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యాడు. నిన్న ఫ్రాన్స్ నుంచి వచ్చిన అతడిని హైదరాబాద్ కూకట్పల్లిలో సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవి కరీబియన్ దీవుల్లో ఉంటూ ‘ఐబొమ్మ’ను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అతడి అకౌంట్లోని రూ.3 కోట్లను ఫ్రీజ్ చేశారు. సినిమాలను విడుదలైన రోజే పైరసీ చేసి వెబ్సైట్లో పెట్టడంపై నిర్మాతలు పలుమార్లు iBommaపై కంప్లైంట్లు ఇచ్చారు.


