News August 14, 2024
గుంపు మేస్త్రి గారికి స్వదేశాగమన శుభాకాంక్షలు: BRS

TG: విదేశీ పర్యటన నుంచి ఇవాళ తిరిగివస్తున్న CM రేవంత్ రెడ్డికి BRS పార్టీ సెటైరికల్ స్వాగతం పలికింది. ‘పది రోజుల US పర్యటనలో సోదరుడు ఎనుముల జగదీశ్ రెడ్డి గారు నూతనంగా స్థాపించిన కంపెనీతో రూ.1000 కోట్ల ఒప్పందం కుదుర్చుకుని నేడు స్వదేశానికి తిరిగివస్తున్న మా గుంపు మేస్త్రి గారికి స్వదేశాగమన శుభాకాంక్షలు. ఇట్లు బ్యాగ్మ్యాన్ ఫ్యాన్స్ అసోసియేషన్’ అని ఈ బ్యానర్ను Xలో పోస్ట్ చేసింది.
Similar News
News November 24, 2025
ధర్మేంద్ర గురించి తెలుసా?

ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. పంజాబ్ లుధియానాలోని నస్రలీ గ్రామంలో 1935 డిసెంబర్ 8న ఆయన జన్మించారు. 1960లో ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరా’ మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చారు. యాక్షన్ కింగ్గానూ పేరు గాంచిన ఆయన సినీ రంగానికి చేసిన కృషికి 1997లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. 2005లో BJP తరఫున రాజస్థాన్లోని బికనీర్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2012లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు.
News November 24, 2025
ఇంటర్వ్యూతో ESICలో ఉద్యోగాలు

<
News November 24, 2025
కెనడా పౌరసత్వ చట్టంలో సవరణ.. విదేశీయులకు గుడ్న్యూస్

విదేశాల్లో పుట్టిన లేదా దత్తత తీసుకున్న చిన్నారుల పౌరసత్వంపై పరిమితులు విధిస్తూ 2009లో తెచ్చిన పౌరసత్వ చట్టంలో కెనడా సవరణ చేసింది. కొత్త చట్టం ద్వారా విదేశాల్లో పుట్టిన కెనడియన్లూ తమ సంతానానికి పౌరసత్వాన్ని బదిలీ చేసే ఛాన్స్ ఉండేలా మార్పులు చేస్తూ బిల్ సీ-3 తెచ్చింది. బిడ్డల్ని కనే ముందు 1075 రోజులు కెనడాలోనే ఉన్నట్లు ప్రూఫ్ చూపాలి. పాత చట్టం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని కెనడియన్ కోర్టు కొట్టేసింది.


