News December 27, 2024

నిజాయితీ, నిరాడంబరతే మన్మోహన్ కిరీటాలు

image

మన్మోహన్ సింగ్ వ్యక్తిగతంగా, రాజకీయంగా ఎంతో నిజాయితీ, నిరాడంబర జీవితాన్ని గడిపారు. మచ్చలేని వ్యక్తిత్వంతో ప్రత్యర్థుల మన్ననలు సైతం పొందారు. ప్రజా జీవితంలో పాటించాల్సిన విలువలకు ఆయన నిదర్శనంగా నిలిచారు. ఎవరిపైనా చిన్న దూషణ, తప్పుడు ఆరోపణలు చేయలేదు. ఆర్థిక, పాలనా అంశాల్లో సమగ్రమైన అవగాహనతో ఆయన పార్లమెంట్ సహా పలు వేదికల్లో చేసిన ప్రసంగాలు ఎంతో మందికి పాఠ్యపుస్తకాల్లాంటివి.

Similar News

News October 19, 2025

దీపావళి: లక్ష్మీ పూజలో ఏ వస్తువులు ఉండాలి?

image

దీపావళి లక్ష్మీ పూజలో సమర్పించే కొన్ని వస్తువులు ఐశ్వర్యం, శ్రేయస్సును ప్రసాదిస్తాయని నమ్ముతారు. లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ చిత్ర పటాలు పెడితే శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. దేవతల నివాసంగా పేర్కొనే శంఖాన్ని, సంపదకు చిహ్నాలుగా భావించే బంగారం, వెండి నాణేలు, నోట్లు, పసుపు గౌరమ్మలను పూజలో ఉంచాలని సూచిస్తున్నారు. కమల పువ్వులు, శ్రీ యంత్రం, పసుపు కొమ్ములు ఉంచడం అదృష్టాన్ని తెస్తుందంటున్నారు.

News October 19, 2025

కొనసాగుతున్న వర్షం.. తగ్గనున్న ఓవర్లు!

image

భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డేకు వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. భారత స్కోర్ 25-2 ఉన్నప్పుడు వర్షంతో తొలిసారి అంతరాయం కలగ్గా అంపైర్లు మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. తర్వాత 11.5 ఓవర్లలో స్కోర్ 37-3 ఉన్న సమయంలో వర్షం మళ్లీ స్టార్ట్ అయింది. తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే గంటకు పైగా మ్యాచ్ నిలిచిపోయింది. దీంతో మరిన్ని ఓవర్లు కోల్పోయే అవకాశముంది.

News October 19, 2025

వంటింటి చిట్కాలు

image

* కూరల్లో గ్రేవీ చిక్కబడాలంటే జీడిపప్పు పొడి, పాలు పోసి కలిపితే సరిపోతుంది.
* డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనె పొంగకుండా ఉండాలంటే కాగిన నూనెలో కాస్త చింతపండు వేయాలి. ఆ తర్వాత డీప్ ఫ్రై చేసినా నూనె పొంగదు.
* తరిగిన బంగాళదుంపలు రంగు మారకుండా ఉండాలంటే ఆ ముక్కలపై వెనిగర్ చల్లాలి.
* వంకాయ కూరలో కాస్త నిమ్మరసం చేర్చితే కూర రంగు మారదు, రుచి కూడా పెరుగుతుంది.